Breaking News

హైకోర్టు ఏర్పాటు కోసం పార్లమెంటులో టీఆర్ఎస్ ఆందోళన

telangana_2395688f

న్యూఢిల్లీ : పార్లమెంటు దద్దరిల్లింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీ ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ ఎదుట ఆందోళన చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణకు ప్రత్యేకంగా వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా టీఆర్ఎస్ ఎంపీలు వినకపోవడంతో  స్పీకర్ మీరాకుమారి సభను 12.00 గంటలకు వాయిదా వేశారు. అనంతరం కూడా టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో సభ మరోసారి వాయిదా పడింది.

అనంతరం టీఆర్ఎస్ ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు స్పీకర్. ఈ సందర్భం గా తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తానని విభజన సమయంలో హామీనిచ్చిన ప్రభుత్వం విస్మరించిందని టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ లు ప్రశ్నించారు. దీనిపై న్యాయశాఖ మంత్రి సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందలేదు. చివరకు వెంకయ్య హామీతో సమస్య సద్దుమనిగింది. అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు బయట గాంధీ విగ్రహం వద్ద తమ ఆందోళన కొనసాగించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *