హైకోర్టును విభజించాలంటూ టి.అసెంబ్లీ తీర్మానం

hicourt

హైకోర్టు విభజన త్వరగా చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. బుధవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీలో ముందుగా సీఎం కేసీఆర్ ఉమ్మడి హైకోర్టును తొందరగా విభజించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ సహా అన్ని పక్షాలు మాట్లాడి మద్దతు తెలిపాయి. అనంతరం సభ హైకోర్టు విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి ఒత్తిడి తేనున్నట్టు సీఎం పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *