
కొత్త ఏడాది… కొత్త ఆశలు… న్యూ ఇయర్ వస్తోందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా పండగ వాతావరణమే. ఎక్కడ చూసినా వెలుగులే… పాత మెమోరీస్ కి గుడ్ బాయ్ చెప్పి…. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పడానికి రెడీ అవుతారు జనాలు. చిన్నా…పెద్దా… అంతా కలిసి సంబరాలు జరుపుకుంటారు. కేక్ లు కట్ చేసి ఒకరికోరు తినిపించుకొని …. నోరును తీపి చేసుకుంటారు. డీజే సౌండ్స్ తో ఎంజాయ్ చేస్తారు… స్వీట్స్ ఇస్తూ ఫ్రెండ్స్, చుట్టాలకు విషెస్ చెప్పుతారు. అంతేకాకుండా, న్యూ ఇయర్ కి కొంతమంది కొన్ని కమిట్ మెంట్స్ చేసుకుంటారు. చెడు అలవాట్లని మానుకోవడం, కొత్తగా చేయాల్సిన పనులను నిర్ణయించుకోవడం లాంటి కొన్ని కమిట్ మెంట్స్ ని డిసైడ్ చేసుకుంటారు. ఇలా రకరకాల ఆశలతో న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టె అందరికి ‘హేపీ న్యూ ఇయర్’.