హెల్మెట్ వినియోగంపై సందేశాన్నిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సృష్టించిన వాగేశ్వరి విద్యాసంస్ధల విద్యార్ధులు

హెల్మెట్ వినియోగంపై సందేశాన్నిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సృష్టించిన వాగేశ్వరి విద్యాసంస్ధల విద్యార్ధులు

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించుకోవాలనే సందేశాన్నిస్తూ వాగేశ్వరి విద్యాసంస్ధలకు చెందిన 2500 మంది విద్యార్ధులు హెల్మెట్ రూపంలో మానవహరంగా నిర్మితమై గురువారం నాడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సృష్టిచారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమం వాగేశ్వరి విద్యాసంస్ధల ఆవరణలో జరిగింది. జిల్లా ఎస్.పి.
డి.జోయల్ డేవిస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ రోడ్డు నియమనిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు గురై వాహనదారులు జీవితాలను అర్దాంతరంగా ముగించుకోవద్దని అన్నారు. జాగ్రత్తలు పాటించి మానవజన్మకు సార్దకత తీసుకురావాలని పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపబోమని ప్రతి వాహనదారుడు ప్రతిజ్ఞ చేసి ఆచరించాలని తెలిపారు. వాగేశ్వరి విద్యాసంస్ధల విద్యార్ధులు హెల్మెట్ వినియోగంపై సందేశాన్నిస్తూ మానవహరంగా నిర్మితమై రికార్డును సృష్టించడం అభినందనీయమన్నారు.

DSC_0269

విద్యార్ధులు చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రతి పల్లెకు ప్రతి వాహనదారులకు చేరుతుందని చెప్పారు. హెల్మెట్ వినియోగించుకోకుండా వాహనాన్ని నడిపి రోడ్డు ప్రమాదం లో ఒక యువకుడి పెళ్ళికి ఒకరోజు ముందు మృతిచెందిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఉదాహరించారు. రోడ్డు నియమనిబంధనలు పాటించక మృత్యువాతపడుతున్న వారి సంఖ్యను గుర్తించి ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్లను వినియోగించాలని తెలిపారు. 2500 మంది విద్యార్ధులు హెల్మెట్ వినియోగంపై సందేశాన్నిస్తూ మానవహరంగా నిర్మితమైనందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అందిన ధృవపత్రాన్ని ఎస్.పి డి.జోయల్ డేవిస్ ఈ సందర్భంగా వాగేశ్వరి విద్యాసంస్ధల ఛైర్మన్ గండ్ర  శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమీషనర్ వినోద్ కుమార్, విద్యా సంస్ధల సహకార్యదర్శి బి.శ్రీనివాసరెడ్డి, కోశాధికారి శోభాదేవి, డైరెక్టర్లు వి.వినోద్, సి.హెచ్.ప్రకాష్రెడ్డి, ఎం.వి.ఐలు శ్రీనివాసరెడ్డి వేణు, డి.శ్రీనివాస్, లింగమూర్తి, కొండల్ రావు, రవీందర్, కిషన్ రావు, ఎ.యం.వి.ఐ రజనీబాయి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts