హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్లను వాడాలని రాష్ర్ట రవాణశాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. అనేక ప్రమాదాల్లో తలకు గాయాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ల వాటకంపై బుధవారం నాడు రవాణాశాఖ-పోలీసు శాఖ సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ బస్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహం, బోయవాడ, కమాన్ చౌరస్తా, వన్ టౌన్, ప్రతిమ చౌరస్తా, తెలంగాణ చౌక్ ల మీదుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ కుమారీ ప్రసాద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎస్సీ డేవిస్ జోయల్, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, అడిషనల్ ఎస్సీ బి జనార్థన్ రెడి్డ, జాయింట్ ట్రాన్స్ పోర్టు కమీషనర్ పాండురంగారావు, డిప్యూటి కమిషనర్ యంజి వినోద్ కుమార్, కరీంనగర్ డిఎస్సీ జె రామారావు, ఆర్ఐ గంగాధర్, ఎంవిఐలు, ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *