
ఢిల్లీ, ప్రతినిధి : భారత దేశంలో రాజులు.. రాజ్యాలు ఎన్నో అద్భుత కట్టడాలు కట్టారు. అవన్నీ వార సత్వ సంపదగా ఇప్పటికీ ఉన్నాయి. కానీ శిథిలావస్థకు చేరుకున్నారు. మరి భావి తరాలకు మన వారసత్వ సంపద ఇచ్చేదెలా అనే సందేహం ఇక అక్కర్లేదు.. నరేంద్ర మోడీ స్వప్నల్లో ఒకటైన ‘వారసత్వ నగర అభివృద్ది, సౌకర్యాల పెంప పథకం (హృదయ్) బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. రూ.500 కోట్లతో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని తొలుత 12 నగరాల్లో అమలు చేస్తున్నారు.
ఈ 12 నగరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు చారిత్రక పట్టణాలున్నాయి.. అవి తెలంగాణలోని కాకతీయ రాజధాని వరంగల్, ఆంధ్రప్రదేశ్ లోని బౌద్ధ క్షేత్రం అమరావతి.. ఇక దేశవ్యాప్తంగా కూడా చారిత్రక నేపథ్యం కలిగిన అమృతసర్, అజ్మీర్, బాదామి, గయ, మథుర, కాంచీపురం, ద్వారక, వారణాసి, పూరీ, వెలంకాణిలు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. వీటన్నింటిని హృదయ్ పథకం కింద అభివృద్ది పరుస్తారు.