హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రారంభం

హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రారంభమైంది.  జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు హుస్సేన్ సాగర్ కు చేరుకొని పనులు ప్రారంభించారు. ముందుగా కాలువల ద్వారా నీటిని బయటకు తరలిస్తున్నారు. అలాగే హుస్సేన్ సాగర్ లో కలిసే మురికి కాలువలను పక్కకు వేరే కాలువలకు తరలించారు.

కాగా భారీప్రొక్లెన్లు, పూడిక తీత మిషన్లతో ఈ ప్రక్షాళన పనులు ప్రారంభించారు. దీనికోసం బడ్జెట్ లోనే 100 కోట్లను కేటాయించారు. హుస్సేన్ సాగర్ లోని వ్యర్థాలను, మట్టిని పూడిక తీసి సీటీ అవుట్ స్కర్టకు తరలిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *