హుస్నాబాద్ శాసనసభ నియోజక వర్గంలో రైతు బంధు కార్యక్రమం సూపర్ హిట్

హుస్నాబాద్ శాసనసభ నియోజక వర్గంలో రైతు బంధు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది .హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ అత్యంత చొరవ తీసుకొని గ్రామ గ్రామాన రైతులకు పెట్టుబడి సహాయ చెక్కులను, పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. సతీష్ కుమార్ , డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ,నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్,  కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగే రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో పాటు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు, పెట్టుబడి సహాయ చెక్కులు పంపిణీ చేశారు. కోహెడ మండలం సముద్రాల గ్రామంలో సీసీ పల్లిలో, నూరేళ్ల గ్రామంలో రైతులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెక్కులు, పాస్ పుస్తకాలు అందజేశారు. చిగురుమామిడి మండలం రేగొండ గ్రామం లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్కుమార్, హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టుబడి సహాయ చెక్కులు అందజేశారు .సీసీ పల్లిలో, కూరెల్ల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ  భవనాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు , చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్, సతీష్ కుమార్ లు బొమ్మకల్ చెరువును సందర్శించారు. హుస్నాబాద్ మండలం జిల్లెల్ల గడ్డ లో రైతు బందు కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో బుధవారం నాడు జరిగిన రైతు బంధు కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు అందజేశారు. రైతుబంధు కార్యక్రమాల్లో పాల్గొన్న సతీష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోనే రైతులు వ్యవసాయం చేయడానికి అవసరమైన పెట్టుబడి అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని సతీష్ కుమార్ అన్నారు.

WhatsApp Image 2018-05-16 at 13.05.03 (3)WhatsApp Image 2018-05-16 at 13.05.03 (7)WhatsApp Image 2018-05-16 at 13.05.03 (9)WhatsApp Image 2018-05-16 at 13.05.03 (8)WhatsApp Image 2018-05-16 at 13.05.03 (5)WhatsApp Image 2018-05-16 at 13.05.02

About The Author

Related posts