Breaking News

హుద్ హుద్ నేపధ్యంలో సునీల్ కుమార్ రెడ్డి సినిమా

p-sunil-kumar-reddy

సెజ్ ల నేపధ్యంలో ‘సొంత ఊరు’,జాలర్ల కధాంశంతో ‘గంగపుత్రులు’,టీనేజ్ ఆకర్షణల నేపధ్యంతో ‘ఒక రొమాంటిక్ క్త్ర్రెమ్ కధ’తీసిన పి.సునీల్ కుమార్ రెడ్డి తాజాగా హుద్ హుద్ నేపధ్యంలో ఓ సినిమా తీసుకున్నారు. కీ ప్రొఢక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై యొక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘ఇటీవల వైజాగ్ తో పాటు ఉత్తరాంధ్రను కుదిపేసిన హుద్ హుద్ తుఫాన్ నేపధ్యంలో ఒక వివాదాస్పదమైన కధాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. సహజంగా ప్రకృతి, మానవాళిపై కత్తికట్టి మోసుకొచ్చే ప్రళయం కన్నా, మనిషి ప్రకృతితో పరాచకాలాడి కొని తెచ్చుకునే ఉపద్రవాలే ఎక్కువ. స్త్ర్రీ, పురుష సంబంధాల్ని, ప్రకృతి- పురుష సంబంధాల్ని సమాంతరంగా, సున్నితంగా, ఆసక్తికరంగా ఈ సినిమాలో చర్చిస్తున్నాం’’అని తెలిపారు. నిర్మాత యొక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ- ‘‘హుద్ హుద్ రాకముందు, వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత అనే అంశాలతో సాగే ఒక రొమాంటిక్ ధ్రిల్లర్ ఇది. సాఫీగా, సాదాసీదాగా సాగిపోయే ఒక కార్తీక్ గాడి జీవితంలోకి వచ్చిన ఒక అందమైన, అదుపు తప్పిన తుపాన్ ‘లీలావతి’.అదేమిటనేది వెండితెరపై చూస్తేనే ఆసక్తికరంగా అనిపిస్తుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే టైటిల్, ఇతర వివరాలు ప్రకటిస్తాం’’అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటింగ్: శివ, కెమెరా: శివరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్ కుమార్, శాంతయ్య.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *