హుజురాబాద్ మధువని గార్డెన్లో మత్స్యకారుల అవగాహనా సదస్సుకు హాజరైన మంత్రి ఈటల రాజేందర్

హుజురాబాద్ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి  హుజురాబాద్ మండలంలో ధాన్యసేకరణ కేంద్రం ప్రారంభం కందుగుల రోడ్ కి శంకుస్తాపన

కమలాపూర్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లు గీత కార్మికుల కుటుంబాలకు పరిహారచెక్కుల పంపిణీ

హుజురాబాద్ మధువని గార్డెన్లో  మత్స్యకారుల అవగాహనా సదస్సుకు హాజరైన మంత్రి.

మత్స్యకారులను తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుంది. వారికీ సంవత్సరం పొడవున ఆదాయం ఉండదు చేపలు పట్టుకునేటప్పుడే ఆదాయం. కానీ బ్రోకర్ల వ్యవస్థ ఆ కొద్దీ ఆదాయాన్ని కూడా దోచుకుపోతుంది. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు చెరువులమీద చేపలు బ్రోకర్లు పట్టుకొంటుంటే అడ్డుకుంటే మీకేంసంబధం అని అడిగారు. కానీ ఎమ్మెల్యేగా ఈ గడ్డ మీద ఎక్కడ బాధ  ఉన్న పట్టించుకుంటా అని చెప్పిన. పేదల బ్రతుకు గురించి సంబంధం ఉంటుంది అనిచెప్పిన. అప్పుడు వారితో మాట్లాడితే పెట్టుబడి పెట్టె పైసలు లేవు , కాంట్రాక్టర్ అయితే సీడ్ ఇస్తారు ఫీడ్ ఇస్తారు అందుకే ఇచ్చేస్తున్నాం అని చెప్పారు.అప్పటి ప్రభుత్వాన్ని సీడ్, పెట్టుబడి ఇవ్వమని అడిగిత్ వీలు కాదు అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని చెరువులకు ఉచితంగా ఫీడ్ అందిస్తున్నాం. బ్రోకర్స్ లేకుండా చేసినం  ఈ సంవత్సరం నుండి రాష్ట్రము లోని ప్రతి చెరువుకు సరిపోయేంత సీడ్ అందిస్తాం  ప్రజల బాధల్లోనుండి మా స్కిం లు పుడుతున్నాయి . మత్స్యకారులు అంటే సముద్రం చుట్టూ ఉన్నవారే అని ఆంధ్ర నాయకులూ అన్నారు. ఇక్కడ కనీసం మత్స్యకారుల బిల్డింగ్స్ అడిగితే ఇవ్వలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల భవనాలు మాత్రమేకాదు పెద్దమ్మ గుడులకు  12 లక్షలు ప్రభుత్వమే అందిస్తుంది. అందుకే మీరు సంపాదించినా డబ్బు పిల్లల చదువులకు ఖర్చు చేయండి  లేదా కుటుంబ అవసరాలకు ఖర్చు చేయండి తప్ప గుళ్లకు, సంఘభవనాలకు ఖర్చు చేయకండి అని మంత్రి ఈటల అన్నారు. గతం లో చాలామంది లంచాలు ఇచ్చి సభ్యత్వాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు సభ్యత్వాలకు ఎవరు ఎవరికీ లంచం ఇవ్వనవసరం లేదు.   చేపలకు మర్కెట్స్ లేవు… మురికి కాలువల పక్కన అమ్ముకొంటున్నారు.  గ్రామస్థులు ఎక్కడ కోరితే అక్కడ చేపల మర్కెట్స్ కట్టుకునేందుకు 5 లక్షల నుండి  50 లక్షల డబ్బులు ఇస్తాం .  మార్కెట్స్ మాత్రమే కాకుండా మొబైల్ మార్కెట్స్ 2 వీలర్, చిన్న ఆటోల్లో తీసుకొని పోయి అమ్ముకొనే విధంగా డిజైన్ చేస్తున్నాం. ఎంతమందికి కావాలి అంటే అంత మందికి ఇస్తాం.  చదువుకున్న పిల్లలు ఈ చేపల నీచులో ఉండేదుకు ఇష్టపడడంలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో చేపలు రైతులు అందరు కోటీశ్వరులు ఉన్నారు. చదువుకున్నవారికి పూర్తిస్థాయిలో లోన్స్ అందిస్తాం.  ఐస్ ఫ్యాక్టరీలు పెట్టుకొనేందుకు సబ్సిడీ రుణాలు ఇస్తాం. డీసీఎం లు కూడా అందిస్తాం. అయితే  ఐక్యంగా ఉండండి మీలో మీరు కొట్టుకోకండి. చెరువులను బ్రోకర్లకు ఇవ్వవద్దు. మత్స్యకారులే చేపలు పెంచండి. ఇప్పటివరకు ఒక్కో చెరువు 3 సంవత్సరాల సమయానికే లీజు ఇస్తున్నారు ఇక ముందు 15 సంవత్సరాలు లీజు ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. మత్స్యసహకారసంఘాలు తమ కాళ్ళమీద తాము నిలబడేలాతయారు చేస్తున్నాం. మేము మీ వెంట పడి మరీ మీరు బాగుపడేలా చేస్తాం.  మత్స్యకారులజీవితాల్లో వెలుగునింపడమే మా లక్ష్యం అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *