హీరోల కన్నా కథే పెద్దదని రాజమౌళి నిరూపించాడు..

rajamouli-and-ram-gopal-varma-directors-facebook

ఏ స్టార్ హీరో అయిన వారి మీదే కథ నడవాలని చూస్తారని.. కానీ రాజమౌళి ఆ ట్రెండ్ కు మంగళం పాడి బాహుబలితో తెలుగు చరిత్రలో మరుపురాని చిత్రాన్ని అందించాడని ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన రాంగోపాల్ వర్మ రాజమౌళి, తెలుగు సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు..

హీరోల కన్నా కథ పెద్దదని రాజమౌళి నిరూపించాడన్నారు. శ్రీమంతుడు మహేశ్, కిక్ 2 రవితేజ ప్రధాన కథలేనని.. కానీ స్టార్లు లేకుండా రాజమౌళి బాహుబలి తీశాడని ప్రశంసించాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి బాటలో నడవాలని సూచించారు.

సింహాలు, పులులు, ఏనుగులు ఉన్న తెలుగు ఇండస్ట్రీలోకి బాహుబలి లాంటి డైనోసార్ ను రాజమౌళి ప్రవేశపెట్టారని మిగతా వారు తప్పక మారాల్సిన పరిస్థితిని తెచ్చాడన్నారు. రాజమౌళిని చూసి మిగతా దర్శకులదరూ జెలసీతో చస్తున్నారన్నారు. కానీ రాజమౌళి మరో సినిమా తీయడానికి నాలుగేళ్లు తీసుకోవద్దని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *