
హిమాలయాలు.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు.. అక్కడ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి చోట ఏదైనా చనిపోయినా.. లేదా ఏదైనా వ్యర్థాన్ని వేసినా మంచు వల్ల సూక్ష్మజీవులు పెరగవు గనుక అది వ్యర్థం కాకుండా మంచుతో బిగుసుకపోయి ఒక గట్టి బండలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇదే హిమాలయాల పర్వతారోహకులు, హిమాలయాలు ఉన్న నేపాల్ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది..
అసలు విషయం ఏంటంటే హిమాలయాలను అధిరోహణ కు ప్రతీ బ్యాచ్ లో 700 మంది వరకు వెళ్తుంటారు. వారందరూ గుంపులుగా కనీసం 2 నెలలు పర్వతారోహణ చేస్తారు. ఈ రెండు నెలలు ఎవరెస్ట్ మీదన మల మూత్ర విసర్జనలు చేస్తారు. మంచుతో నిండి ఉండడం వల్ల ఆ వ్యర్థాలు విచ్చిన్నం కావు. అలాగే ఉండిపోతాయి. దీనివల్ల రోగాలు అధికంగా వ్యాపిస్తున్నాయి. ఆ వ్యర్థాలను ఎలా తొలగించాలో తెలియక నేపాల్ ప్రభుత్వానికి తలబొప్పి కడుతోంది. మళ్లీ పర్వతారోహణ చేసే పర్యాటకులకు ఈ వ్యర్థాలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.