
సీఎం కేసీఆర్ మాస్టారు అవతారమెత్తారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే , మంత్రులు పాల్గొన్న సమావేశంలో ధాటిగా మాట్లాడారు. ఓ మాస్టారులా తన రాజకీయ అనుభవంలోని ఎత్తుపల్లాలను వివరించారు. అధికారులతో ఎలా పనిచేయించుకోవాలో .. వారి వెంట పడి తాను ఎలా అభివృద్ధి చేసానో చెప్పుకొచ్చారు.
అంతేకాదు హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చుకోవడానికి ఏం చేయాలనే దానిపై రహదారులు, నీటి సరఫరా పారిశుధ్యం, వసతుల కల్పనకు ఏం చేయాలనే దానిపై కేసీఆర్ కార్పొరేటర్లకు హితబోధ చేశారు. హైదరాబాద్ లోని ప్రగతి రిసార్ట్స్ లో కార్పొరేటర్లకు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ చేసిన ఓ 3 గంటల ప్రసంగానికి సభికులు చప్పట్లతో తమ హర్షధ్వానాలు చేశారు. అంతలా ఇరగదీశారు కేసీఆర్..