Breaking News

హార్డ్ వేర్ హబ్ కోసం టీ. సర్కార్ ప్లాన్

Telangana_Hub

తెలంగాణను హార్డ్ వేర్ రంగంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ తయారీ మండల్లకు తెలంగాణ ఐటీశాఖ ప్రత్యేక రాయితీ ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వ విధివిధానాలు రూపొందిస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లు ఈ విధివిధానాలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు.

హైదరాబాద్ శివారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టుపక్కల 900 ఎకరాలను ఈ పరిశ్రమల కోసం కేటాయించనుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకొస్తున్నాయి.. ఇప్పటికే మైక్రోమాక్స్, సెలకాన్ కంపెనీలు తమ కంపెనీలను తెలంగాణలో స్థాపించాయి.. మరికొన్ని తైవాన్ కంపెనీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి.. దీంతో తెలంగాణ హార్డ్ వేర్ హబ్ గా మారనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *