
ఇసుక మాఫియా ఆగడాలు అన్ని ఇన్ని కావు.. సిరిసిల్ల-హైదరాబాద్ కు మానేరు వాగునుంచి భారీగా ఇసుక తరలివెళ్తోంది.. లారీలు మోతాదుకు మించి ఓవర్ లోడ్ తో వెళుతున్నాయి. దీంతో అటుగా వెళ్తున్న సిరిసిల్ల ఆర్డీవో భిక్షునాయక్ లారీలను ఆపాడు.. సమీపంలో ఉన్న వేబ్రిడ్జి వద్ద తూకం వేయగా దాదాపు లారీలో మోతాదుకు మించి 10 టన్నుల ఇసుక తరలిస్తున్న తేలడంతో వాటన్నింటిని సీజ్ చేస్తున్నట్టు ఆర్టీవో ప్రకటించారు.
దీంతో వెంటనే ఇసుక లారీ డ్రైవర్ ఫోన్ చేసి హరీష్ రావు తమ్ముడు మాట్లాడుతున్నాడంటూ ఆర్టీవోకు ఫోన్ అందించారు. ‘హరీష్ పీఏతో ఫోన్ చేయిస్తాన్ సార్.. మా అన్నయ్య హరీష్ వదిలేయండి’ అంటూ అనడంతో ఆర్డీవో భిక్షు నాయక్ శివాలెత్తిపోయాడు. ఎవడైతే నాకేంటి..? హరీష్ రావు అధిక బరువుతో లోడ్ తో వెళ్తుంటే సహించడు. ఆయనే మమ్మల్ని పట్టుకోమని చెప్పింది.. రోడ్లు నాశనమై.. పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇసుక లారీలు అధికలోడ్ తో వెళితే చర్యలు తప్పవని ఆయన ఫోన్ పెట్టేశారు.