
సిద్దిపేటను బంగారు తునకలా మారుస్తున్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో సిద్దిపేటకు ఆనుకొని ఉన్న చెరువును మిషన్ కాకతీయలో రూపు రేఖలు మార్చారు. మినీ ట్యాంక్ బండ్ లా మార్చాడు. చెరువు ఒడ్డున జనం సేదతీరడానికి అనువుగా సేదతీరే కుర్చీలు, అర్చీలతో వేసిన మంచి పెంకుటిల్లులు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి వెళ్లడానికి జనం పోటెత్తుతున్నారు.