హరిత‌హారంలో భాగంగా గ్రేట‌ర్‌లో మొక్క‌లు నాటిన ముఖ్య కార్య‌ద‌ర్శి, క‌మిష‌న‌ర్‌లు

బ‌ల్దియా హ‌రిత‌హారం

మొక్క‌లు నాటిన ముఖ్య కార్య‌ద‌ర్శి, క‌మిష‌న‌ర్‌లు

ఉచిత ట్రీ గార్డ్‌ల‌కు విశేష స్పంద‌న‌

హరిత‌హారంలో భాగంగా గ్రేట‌ర్‌లో వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్జ‌న్‌రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ ఉన్న‌తాధికారులు పెద్ద ఎత్తున మొక్క‌లునాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ కార్యాల‌యంలో మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిలు మొక్క‌లు నాట‌గా ముళ్ల‌క‌త్వ న‌ర్స‌రీని సంద‌ర్శించిన జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ స‌మీపంలోని పార్కులో మొక్క‌లు నాటారు. న‌గ‌రంలోని వివిధ స‌ర్కిళ్లలో జోన‌ల్, డిప్యూటి క‌మిష‌న‌ర్లు కూడా హ‌రిత‌హారంలో భాగంగా వివిధ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు పెద్ద ఎత్తున మొక్క‌ల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. గ‌త రెండు రోజులుగా న‌గ‌రంలో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా మొక్క‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌డం, నాట‌డం జ‌రిగింద‌ని జీహెచ్ఎంసీ బ‌యోడైవ‌ర్సిటీ విభాగం తెలియ‌జేసింది.

haritha haram 1     haritha haram 2

ఉచిత ట్రీ గార్డ్‌ల‌కు విశేష స్పంద‌న‌

న‌గ‌రంలో చేప‌ట్టిన హ‌రిత‌హారం మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు ఉచితంగా ట్రీగార్డ్‌ల‌ను కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్ బులిటిలో భాగంగా అందించాల‌ని జీహెచ్ఎంసీ ఇచ్చిన పిలుపుమేర‌కు న‌గ‌రంలోని వివిధ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌ల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. కుత్బుల్లాపూర్ స‌ర్కిల్‌లో హెట‌రో డ్ర‌గ్స్ యజ‌మాన్యం ల‌క్ష రూపాయ‌లను అందించింది. కాప్రా స‌ర్కిల్‌లో తెలంగాణ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలోని పారిశ్రామిక వేతలు రూ. 3.70 ల‌క్ష‌లు, హోట‌ళ్లు, ఆసుప‌త్రులు, ఫంక్ష‌న్‌హాళ్ల యాజ‌మ‌న్యాలు రూ. 2.10 లక్ష‌ల‌ను ట్రీగార్డ్‌ల కొనుగోలుకు అంద‌జేశాయి. అయితే ఆయా సంస్థ‌లే ట్రీగార్డ్‌ల‌ను కొనుగోలు చేసి జీహెచ్ఎంసీకి అంద‌జేసేందుకుగాను ట్రీగార్డ్‌లు ల‌భ్య‌మ‌య్యే స్థ‌లాలు, కంపెనీల వివ‌రాల‌ను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ప్ర‌ద‌ర్శించింది.

haritha haram 3     haritha haram 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *