హరితహారంలో మొక్కలు నాటే అన్నిప్రదేశాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి

నాటిన ప్రతీ మొక్కను జియో ట్యాగింగ్ చేయాలి. 

వాటి రక్షణ పరిస్థితిపై ఎప్పటికప్పుడు గూగుల్, శాటిలైట్ మ్యాపుల ద్వారా  పర్యవేక్షణ.

నాటిన మొక్కల లెక్కలు మాత్రమే కాదు.. నాణ్యత, రక్షణ కూడా ముఖ్యమే.

ఈ నెల పది కల్లా అన్ని ప్రదేశాల్లో రిజిస్ట్రేషన్ తో సహా ఏర్పాట్లు పూర్తి కావాలి.

సర్పంచ్ నుంచి మంత్రిదాకా అందరి  ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండాలి.

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ మంత్రి  జోగు రామన్న, ఛీఫ్ సెక్రటరీ  ఎస్పీ సింగ్. 

ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే మూడో విడత తెలంగాణకు హరితహారం ఏర్పాట్ల పై  సచివాలయంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, చీఫ్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో  కాన్ఫరెన్స్ నిర్వహించారు. 31 జిల్లాల్లో ప్రతీ కలెక్టర్ నుంచి ఇప్పటిదాకా హరితహారం కోసం జరిగిన ఏర్పాట్లు, పురోగతి, 12 నాడు, ఆ తర్వాత కొనసాగింపుపై జిల్లాల వారీగా సమాచారం తీసుకున్నారు. అవసరమైన సామాగ్రి సిద్దంగా ఉందా, మొక్కలు నాటేందుకు జిల్లా టార్గెట్ ఎంత, ఇప్పటిదాకా ఎన్ని గుంతలు ( పిట్లు ) తీయించారు, కార్మికులకు కూలీ డబ్బు అందుతోందా, ఎన్ని ట్రీ గార్డులు అందుబాటులో ఉన్నాయి. మొక్కలు చనిపోతే వెంటనే మార్చేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్దమా.. ఇలా హరితహారంకు సంబంధించిన అన్ని విషయాలపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి జోగురామన్న, ఛీప్ సెక్రటరీ ఎస్పీ సింగ్ సుదీర్ఘంగా సమీక్షించారు. మొక్కలు నాటే అన్ని ప్రాంతాలను తప్పనిసరిగా అటవీశాఖ వెబ్ సైట్ TGFMIS లో రిజిస్ట్రేషన్ చేయాలని, ఆ తర్వాత జియో టాగింగ్ చేయాలని చెప్పారు.  దీనివల్ల గూగుల్, సాటిలైట్ మ్యాపులతో మొక్కల రక్షణ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన అటవీ శాఖ మంత్రి జోగు రామన్న 

సీఎం కేసీఆర్ 12న కరీంనగర్ లో హరితహారం ప్రారంభిస్తారు.

31 జిల్లాల్లో విజయవంతంగా హరితహారం జరగాలి.

ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత,  ప్రతిష్టాత్మక పథకం.

స్కూల్, కాలేజ్ పిల్లల్లో చైతన్యం కలిగించి హరితహారంలో పాల్గొనేలా చేయాలి.

హరిత రక్షణ కమిటీలు మరింత బాధ్యతగా మెలిగేలా చూడాలి.

నాటే మొక్కలు తగిన ఎత్తులో ఉండాలి. కనీసం మీటర్ ఎత్తు ఉంటే మంచిది.

ఈ నిరంతర ప్రక్రియ కోసం కలెక్టర్లు, అధికారులు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంచార్జి ఆఫీసర్లు ఏడాది పొడవునా నాటిన మొక్కల బాధ్యత తీసుకోవాలి.

రహదారులకు ఇరువైపులా నాటే మొక్కల రక్షణ అత్యంత ప్రాధాన్యత.

వర్షాలకు విరామం వస్తే.. మొక్కలు నాటడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి.

 

*ఛీప్ సెక్రటరీ  ఎస్పీ సింగ్ 

హరితహారం రోటీన్ ప్రక్రియ అనే అలసత్వం ఎంతమాత్రం వద్దు.

వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

స్వయంగా నా పర్యవేక్షణ ప్రతీ స్థాయిలో ఉంటుంది.

జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు హరితహారం పురోగతి చూసేందుకు ఒక సీనియర్ ఆఫీసర్ ను నియమించండి.

అన్ని వర్గాల ప్రజలను, ప్రజా ప్రతినిధులను 12 నుంచి పాల్గొనేలా చేయండి.

గ్రామ స్థాయిలో నాటిన మొక్కల పర్యవేక్షణ బాధ్యత వార్డు మెంబర్లు, సర్పంచ్ లకు అప్పగించండి.

కళాజాతాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి, కార్యక్రమానికి తగిన ప్రచారం కలిగిస్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది.

సీ.ఎం కేసీఆర్ చెప్పిన విధంగా ప్రతీ ప్రదేశంలో ఒక గ్రీన్ బ్రిగేడ్ ( హరిత సైన్యం) ఉండాలి.

మొక్కల రక్షణపై ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. నాటిన మొక్కల సంఖ్య ఎంత ముఖ్యమో, వాటి రక్షణ బాధ్యత కూడా మనందరిపై ఉందని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ట్రీ గార్డులు వెంటనే ఏర్పాటు చేయకపోతే, నాటిన మొక్కలను గేదేలు, మేకలు వెంటనే తినటయో, ధ్వంసమో చేస్తాయని, ముందస్తు ప్రణాళికల్లో తప్పని సరిగా రక్షణ ఎజెండా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి హరితహారం విజయవంతం కోసం పట్టుదలతో ఉన్నారని, అధికారులు, సిబ్బంది అంతే నిబద్దతతో పనిచేయాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సూచించారు. మొక్కల రక్షణపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి శ్రీఅజయ్ మిశ్రా, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్ , హోం శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రాజీవ్ త్రివేది , ఆర్ అండ్ బిముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ,  ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ శివశంకర్,  గిరిజన అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ బెనహర్ మహేశ్ దత్ ఎక్కా, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ శ్రీమతి నీతూ ప్రసాద్ , సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్,  పి.సి.సి. ఎఫ్  శ్రీ పి.కె.ఝా, అదనపు పీ.సి.సి.ఎఫ్. ఆర్.ఎమ్ డోబ్రియల్ ఇతర సంబంధిత అధికారులుపాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *