
అటవీ సంపద పరిరక్షణ, సామాజిక అడవుల పెంపకం, వివిధ రకముల అటవీ ఉత్పత్తులు, మరియు అడవుల పరిరక్షణ ప్రాముఖ్యతను గమనించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా 2016 సంవత్సరంలో అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థను సిద్దిపేట జిల్లా ములుగులో ప్రారంభించడం జరిగింది. బి.యస్.స్సి. ఫారెస్ట్రీ విధ్యార్థులు చదువుతో పాటు జాతీయ సేవా కార్యక్రమములో భాగంగా వివిధ సామాజిక కార్యక్రమములో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మొదటి మరియు రెండవ సంవత్సర విధ్యార్థులు వారి సెమిస్టర్ పరీక్షల అనంతరం వారికున్న 25 రోజుల సెలవు దినములను సామాజిక కార్యక్రమములకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకముగా చేపట్టిన నాలుగవ విడత “తెలంగాణ కు హరిత హరం” కార్యక్రమములో పాల్గొంటున్నారు. 97 మంది విధ్యార్థులు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 31 జిల్లాల్లో 28 గ్రూపులుగా విడిపోయి ప్రతి గ్రూప్ విధ్యార్థులు ఒక అటవీ రేంజ్ పరిధిలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని పచ్చని పల్లెగా మార్చుటకు సంకల్పించారు. ఈ హరిత హారం కార్యక్రమంలో ప్రజలను పాఠశాల విధ్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతీ ఒక్కరి చేత అయిదు మొక్కలు నాటే కార్యక్రమమును కొనసాగిస్తున్నారు. కళాశాల విధ్యార్థులు యన్.యస్.యస్. కార్యక్రమములో భాగముగా పర్యావరణ పరిరక్షణ, స్వచ్చ్ భారత్, ప్లాస్టిక్ నిర్మూలన, జల వనరుల సంరక్షణ, రక్తదాన ప్రాముఖ్యత, అక్ష్రరాస్యత ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను సామాజిక భాద్యతగా గత రెండు సంవత్సరాల నుండి వివిధ కార్యక్రమములలో స్వచ్చందంగా పాల్గొని ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. తెలంగాణకు హరిత హరం కార్యక్రమములో పాల్గొనటం సామాజిక భాద్యతగా భావిస్తూ నేరుగా గ్రామములో పాల్గొని అక్కడి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క విధ్యార్థి అక్కది సమస్యలను గుర్తిస్తూ వాటిని ఎలా పరిష్కారించాలో తెలుసుకోగలిగామని వివరించారు. ఈ హరిత హరం కార్యక్రమము వలన రాబోవు రోజుల్లో మన రాష్ట్ర అటవీ విస్థీర్ణం 24% నుండి 33% వరకు తప్పకుండా పెరుగుతుందని దానికి మన అందరి భాద్యతగా చెట్లను పెంచుదాం పచ్చని తెలంగాణకు బాటలు వేద్దాం అని ఉత్త్సాహంగా విధ్యార్థులు గ్రామస్థులను భాగస్వాములను చేస్తూ హరిత హారంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల డీన్, డా.జి. చంద్రశేక్ రెడ్డి, ఐ.యఫ్.యస్. గారు అదనపు అటవీ సంరక్షణ అధికారి, హైదరాబాద్ సర్కిల్ మరియు అటవీ కళాశాల సహయ ఆచార్యులు డా. జాఫర్ షేక్, విధ్యార్థులను ఉత్సాహ పరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రొత్సహిస్తున్నారు.
మొత్తం పాల్గొన్న విధ్యార్థులు – 97, దత్తత తీసుకొన్న గ్రామాలు – 97, మొత్తం గ్రూపులు – 28, పాల్గొన్న జిల్లాలు – 31