హరితహారంపై దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రెండు రోజుల శిబిరం

విద్యా ప్రాంగణాల్లో నాటిన మొక్కలు వంద శాతం బతికేలా చర్యలు

హరితహారంపై దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రెండు రోజుల శిబిరం

విద్యాశాఖ, అటవీశాఖ నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్న అన్ని జిల్లాల అధికారులు

స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల పేరుతో విద్యార్థుల భాగస్వామ్యంతో హరితహారం

హరితహారాన్ని మరింత విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని హరిత తెలంగాణ దిశగా భాగస్వామ్యం చేసేందుకు అటవీ శాఖ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని స్థాయిల్లో విద్యార్థులను హరితహారంలో భాగం చేసి, వారే వారధులుగా ఇంటింటికి పర్యావరణ అవగాహన పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. స్వచ్ఛ పాఠశాల – హరిత పాఠశాల నినాదంలో ప్రతీ విద్యాలయం ఆవరణను ఆకుపచ్చగా మార్చనున్నారు. ప్రాధమిక స్కూళ్లు మొదలు, హైస్కూల్లు, హాస్టళ్లు, సంక్షేమ భవనాల్లో కూడా హరితహారం అమలు కానుంది. దీనికోసం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు శిక్షణా తరగతలు హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగాయి. తొలిరోజు 16 జిల్లాల నుంచి, రెండో రోజు 15 జిల్లాల నుంచి అధికారులు హాజరయ్యారు. అటవీ, విద్యాశాఖల నుంచి ముగ్గురు చొప్పున జిల్లాకు ఆరుగురు అధికారులు పాల్గొన్నారు. అటవీ శాఖ నుంచి డీ.ఎఫ్.ఓ, ఎఫ్.డీ.ఓ, రేంజ్ అధికారులు హాజరవగా, విద్యశాఖ నుంచి డీ.ఈ.ఓ, డిప్యూటీ డీ.ఈ.ఓ, నోడల్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అటవీ శాఖ నుంచి పీసీసీఎఫ్ లు పీ.కే.ఝా, రఘువీర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని హరితహారం ఆవశ్యకత, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు, క్షేత్ర స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయటం, నాటిన మొక్కల రక్షణ చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి ల్లో రెండు శాఖలకు చెందిన సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. హరితహారంలో చురుగ్గా పాల్గొని హరిత వారథులుగా ఎంపిక అయ్యే విద్యార్థులకు గుర్తింపుగా క్యాప్, బ్యాడ్జీ, కండువా లాంటివి ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే పర్యావరణ అవగాహన ఉండి కార్యక్రమంలో పాల్గొనే టీచర్లను హరిత ఉపాధ్యాయులుగా గుర్తించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో విడత హరితహారంలో ఒక రోజును పూర్తిగా విద్యార్థుల కోసం కేటాయించి, అన్ని విద్యాసంస్థల్లో మొక్కలు నాటించాలని నిర్ణయించారు. సుమారు ముఫ్పై లక్షల మంది విద్యార్థులు ఒకే రోజు కోటిన్నర మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేస్తున్నారని ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ కోట తిరుపతయ్య తెలిపారు.

HARITHA HARAM 1      HARITHA HARAM 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *