Breaking News

హరితహరం రెండో విడతలో ప్రతి శాఖకు లక్ష్యం ఇస్తాం నీతూ ప్రసాద్

హరితహరం రెండో విడతలో ప్రతి శాఖకు లక్ష్యం ఇస్తాం నీతూ ప్రసాద్

కరీంనగర్: హరితహరం రెండో విడత కార్యక్రమంలో ప్రతి శాఖకు లక్ష్యం నిర్ణయిస్తామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో హరితహరం కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల ఆధీనంలో వున్న భూమిలో హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటాలని కలెక్టర్ అన్నారు. జిల్లా విద్యాధికారి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను సమన్వయపరచి ఆవరణలలో మొక్కలు నాటుటకు చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి విడత కార్యక్రమంలో వర్షాభావ పరిస్ధితుల దృష్ట్యా లక్ష్యాలను సాధించలేకపోయామన్నారు. మొదటి విడతలో నాటిన మొక్కలలో బ్రతికిన మొక్కల వివరాలను అప్ లోడ్ చేయాలన్నారు. 2016-2017 సంవత్సరంలో 4 కోట్ల మొక్కలు నాటుటకు లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితి 40 వేల మొక్కలకు తక్కువ కాకుండా కార్యాచరణ వుండాలని కలెక్టర్ అన్నారు. గ్రామ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అప్ లోడ్ చేయాలన్నారు. ఖాళీ స్దలాల, నర్సరీల, ప్లాంటేషన్ డైరెక్టరీని రూపొందించి సమర్పించాలన్నారు. కాకతీయ మిషన్ కార్యక్రమం క్రింద చెరువు గట్లపై ఈత, తాటి చెట్ల పెంపకానికి కావాల్సిన మొక్కల వివరాలు సమర్పించాలన్నారు. ఏ ఏ రకాల మొక్కలు ఎంత మేరకు అవసరమో నివారించి వాటి పెంపకానికి చర్యలు చేపట్టాలన్నారు. మండలంలో కావాలసిన మొక్కల పెంపకం కొరకు ఆ మండలంలోనే నర్సరీలు ఏర్పాటుచేయాలని, ఒక మండలం నుండి మరొక మండలానికి మొక్కల రవాణాకు అవసరం లేకుండా చేయాలని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలన్నారు. కరీంనగర్ జిల్లాను అగ్రస్దానంలో నిలపాలని, దీనికి అధికారులు వ్యక్తిగత శ్రద్దతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు సంయుక్త కలెక్టర్ డా. ఏ. నాగేంద్ర, డ్వామా పిడి వైవి. గణేష్, జడ్పి సిఇవో సూరజ్ కుమార్, డివిజనల్ అటవీ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపిడివోలు, సింగరేణి, రైల్వే, రహదారి రవాణా, మార్క్ ఫెడ్, ఎన్ టిపిసి, ఎఫ్ సిఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *