హరితహరం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

కరీంనగర్: హరితహరం కార్యక్రమం పై ప్రజలలో అవగాహన కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. గురువారం మండల అధికారులతో కలెక్టరేటు నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్ధలు, అధికారులు అందరు భాగస్వామ్యం అయ్యి ఉద్యమంలాగా నిర్వహించాలని అన్నారు. ప్రతి మండలానికి 7600 ట్రీ గార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీలైనన్ని ట్రీ గార్డులను స్వచ్ఛంద సంస్ధల సహకారంతో సేకరించాలని అన్నారు. మొక్కల పెంపకం ప్రణాళికను మండల వారిగా, గ్రామాల వారిగా రూపొందించాలని అన్నారు. కాలువల వద్ద ఉన్న ఖాళీ స్ధలంలో, పొలాల గట్లపైన మొక్కలను నాటాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మొక్కలు నాటడానికి ఉపాధిహమీ క్రింద నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 50 మొక్కలు కంటే ఎక్కువగా ఉన్న పాఠశాల, కళాశాలలో ఉపాధి హమి క్రింద మొక్కల నిర్వహణ చేపట్టవచ్చని అన్నారు. హరితహరం పై డివిజన్ స్ధాయి సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. మండల స్ధాయిలో అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. హరితహరం పైన కమ్యూనిటి ప్లాంటేషన్ 15 రోజుల క్యాలెండర్ ను రూపొందిస్తున్నామని అన్నారు. బి.సి. కళ్యాణలక్ష్మీ క్రింద అందిన ధరఖాస్తులను తహసీల్దార్లు తనిఖీ చేసి పంపాలని అన్నారు. 647 ధరఖాస్తులు ఆన్ లైన్లో అందాయని అన్నారు. 21వ తేది నుండి యువదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని యూత్ క్లబ్ సభ్యులు కళాబృందాల సహకారంతో ప్రభుత్వ పధకాల పై విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. వ్యవసాయ సీజన్ ఉన్నందున తహసీల్దార్లు రైతులకు పహనీలకు వెంటనే ఇవ్వాలని అన్నారు. బ్యాంకులు రైతులకు పంట రుణాలను మంజూరు చేయాలని అన్నారు. తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు జె.ఎల్.బి.సి మీటింగులకు ఖచ్చితంగాహజరు కావాలని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించు కోవాలని అన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 27 నుండి వారం రోజుల పాటు పిల్లలకు మెదడు వాపు వ్యాధి నిరోధక వాక్సిన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, జిల్లా రెవిన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *