హరితహరంలో ఎక్కువ మొక్కలు నాటాలి

కరీంనగర్: అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో హరితహరం కార్యక్రమం క్రింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎం.పి.డి.ఓ.లు, ఉపాధి హమి సిబ్బంది , ఎక్త్సెజ్, పంచాయితిరాజ్, ఆర్ అండ్ బి, అటవీ శాఖాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ, మండల, జిల్లా స్ధాయిల్లోని అధికారులు సమన్వయంతో హరితహరం కార్యక్రమం విజయవంతం చేసి, లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటాలన్నారు. క్షేత్ర సిబ్బందికి తగిన సలహలు అందించాలని, క్షేత్ర పర్యటనలు చేయాలని అన్నారు. గ్రామాలకు వెళ్లే ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రహదారుల కిరువైపుల, ప్రభుత్వ, ప్త్ర్రెవేటు భవనాలు, ఖాళీ స్ధలాల ప్రాంతాలు, పాఠశాలల ఆవరణలు, ఇతర సముదాయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు చెట్ల పెంపకం వంటి అంశాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాల విద్యార్ధులచే ర్యాలీలు నిర్వహించాలన్నారు.చెరువుగట్లు, కెనాల్ ప్రాంతాలలో నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో చేపట్లాలన్నారు. మంధని, రామగుండం ప్రాంతాల్లో ఎన్.టి.పి.సి. వారి సౌజన్య సహకారంతో మొక్కలు నాటాలన్నారు. 67 లక్షల రూపాయల విలువ గల వివిధ రకాల మొక్కల సరఫరా ఎన్.టి.పి.సి. చేస్తుందని ఇందులో 2 లక్షల మామిడి, 3 లక్షల యుకలిప్టస్ వంటి వాటిని సరఫరా చేస్తారన్నారు. స్ధానిక కాలనీలు, మేజర్ రోడ్ల కిరువైపుల మొక్కలను నాటాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమమైన విజయవంతం చేయవచ్చని, గ్రామాల్లో పాఠశాలల విద్యార్ధులు, ఎన్.ఆర్.ఇ.జి. కూలీలు, మహిళా సంఘాల సభ్యులచే ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2700 పైగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రతి విద్యార్ధిచే మొక్కలు నాటించి సంరక్షించే విధంగా విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో సర్ ప్లస్ ల్యాండులలో మొక్కలను నాటించాలని అన్నారు. ఆయా గ్రామాల్లో మొక్కలను సరఫరా చేసేందుకు సమీప నర్సరీల్లో మ్యాచింగ్ బ్యాచింగ్ చేయడం జరిగిందని అన్నారు. అటవీ శాఖ ద్వారా సరఫరా చేయబడుతున్న పబ్లిసిటీ మెటీరియల్ గ్రామాల్లో, ముఖ్య కూడళ్లలో, ప్రజలకు కనబడే విధంగా అతికించాలన్నారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పై ఆమె సమీక్షించారు. ప్రజలను మరింత చైతన్య పరిచి మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్లాలని, వాటిని వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సామాజిక అటవీ సంరక్షణ అధికారి మహేందర్ రాజు మాట్లాడుతూ, మరో నాలుగైదు వర్షాలు కురిసిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలను నాటాలన్నారు. ప్రతిపాదిత ప్రాంతాలలో గుంతలు త్రవ్వించాలన్నారు. ఎస్పీ, ఎస్టీల భూములు, చిన్న సన్నకారు రైతులకు పండ్లనిచ్చే మొక్కలు నాటేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. వివిధ ప్రాజెక్టులు, భూములు, కెనాల్స్, చెరువులు, కుంటలు, శివారు ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. జిల్లాకు 20 వేల స్టిక్కర్ పోస్టర్లు, 50 వేల స్లోగన్స్, 12 వేల లేబుల్స్, 25 వేల కరపత్రాలు, టోపిలు, ఖండువాలు వస్తున్నాయన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *