Breaking News

హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి విషమం

_66aef40a-cf08-11e5-a2fe-c1a20f4c7a81

సియాచిన్ లో మంచు చరియలు విరిగిపడి 6 రోజులు మృత్యువుతో పోరాడి కోమాలోకి వెళ్లిన భారత జవాను హనుమంతప్ప పరిస్థితి విషమంగా తయారైంది. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్ప ప్రస్తుతం కోమాలో ఉన్నారు.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

సియాచిన్ లో  800 అడుగుల భారీ మంచు చరియ విరిగిపడింది. అక్కడే కాపాలా కాస్తున్న 10 మంది సైనికులు ఈ మంచు చరియకింద కూరుకుపోయారు. ఆర్మీ వచ్చి పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. 6 రోజుల తర్వాత 9మంది మృతదేహాలు వెలికితీశారు. అందులో హనుమంతప్ప అనే సైనికుడు బతికే ఉన్నాడు. 6 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ కొనఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన ఢిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కాగా మంచు చరియల కింద ఆరురోజులుగా పోరాడి ప్రాణాలతో వెలికితీయబడ్డ సైనికుడు హనుమంతప్ప నిజంగా చిరంజీవి అంటూ ప్రధాని కదలిపోయారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి వచ్చి సైనికుడిని పరామర్శించారు. సైనికుడి ధీరత్వానికి సలాం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *