Breaking News

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లోకి..

Delhi modelFOR HYED_EPS

హైదరాబాద్(ఎ.ఎన్) : కట్టుకున్నొళ్లే వదిలిసినట్టు తయారైంది కాంగ్రెస్ పరిస్థితి.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలిసి రావడంలేదు.. ముందు టీఆర్ఎస్ తో పొత్తు అన్నారు. అనక వద్దన్నారు. ఆ పై 5 స్థానాల్లో పోటీకి పెట్టింది కాంగ్రెస్. కానీ ఏ ఒక్క అభ్యర్థి తాను నిలబడానని ముందుకు రాకపోవడం గమనార్హం. అందరినీ బతిమిలాడి.. బుజ్జగించి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నల్గొండ, మహబూబ్ నగర్ , మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి లల్లో అభ్యర్థులను బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ. కాగా మెదక్ , నిజామాబాద్ అభ్యర్థులు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి నామినేషన్లు ఉపసంహరించుకొని టీఆర్ఎస్ లో చేరిపోవడం కాంగ్రెస్ పార్టీని మరింత కృంగదీసింది. కాంగ్రెస్ అభ్యర్థులే ఇలా టీఆర్ఎస్ లో చేరే దుర్భర పరిస్థితి రాజకీయాల్లో ఎప్పుడు రాలేదు..

ఇప్పుడు మెదక్, నిజామాబాద్ ల్లో పోటీలో లేని కాంగ్రెస్ ను అధిష్టానం మందలించింది. అభ్యర్థుల ఎంపికలో ఘోరంగా వ్యవహరించారని మండిపడింది.. టీఆర్ఎస్ లో వలసల పర్వంతో అన్ని పక్షాలకు వణుకు పుడుతోంది. అసలు ప్రతిపక్షం ఉంటుందా ఉండదా తెలంగాణలో అన్న సందిగ్ధం నెలకొంటోంది.. టీఆర్ఎస్ దూకుడు గ్రేటర్ లోనూ పనిచేసే అవకాశం ఉండనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *