హతవిధి.. ఏమిటిది..

PM_Modi_Rajya_Sabha_PTI_650

-పెద్దల సభలో బీజేపీకి ఝలక్
న్యూఢిల్లీ, ప్రతినిధి : బీజేపీకి రాజ్యసభలో అనుకోని అవాంతరం ఎదురైంది. రాజ్యసభలో తమ పప్పులు ఉడకవని మంగళవారం జరిగిన పరిణామాలతో బీజేపీకి అర్థమైంది. రాష్ట్రపతి ప్రసంగంలో నల్లధనం, అవినీతి ప్రస్తావన లేదంటూ ధన్యవాద తీర్మానానికి సీపీఎం ప్రతిపాధించిన ‘సవరణ’ విజయం సాధించింది.

సీపీఎం నేత సీతారాం ఏచూరి ధన్యవాద తీర్మానానికి సవరణ ప్రతిపాదించారు. దీన్ని విరమించుకోవాలని మంత్రి వెంకయ్యనాయుడు ఎంత ప్రయత్నించినా ఏచూరి వినిపించుకోలేదు. పట్టుబట్టి ఓటింగ్ పెట్టించిన ఏచూరి చివరకు ఓటింగ్ లో నెగ్గి బీజేపీకి దారుణ ఝలక్ ఇచ్చారు. మొత్తం మంది సభ్యుల్లో 118 మంది సవరణకు మద్దతివ్వగా.. ప్రభుత్వంవైపు 57 మందే అనుకూలంగా ఓటేశారు.. దీంతో రాష్ట్రపతి ప్రసంగంలో నల్లధనం ఫెయిల్యూర్ అంశం చేర్చాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. మున్ముందు కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *