Breaking News

హజ్ యాత్రికుల కోసం ఉత్తమ ఏర్పాట్లు: ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ

హజ్ యాత్రికుల కోసం ఉత్తమ ఏర్పాట్లు: ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ

రాష్ట్రం నుంచి హాజ్యాత్రకు వెళ్లే హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. గురువారం నాంపల్లిలోని హాజ్హౌస్ లో ఉన్నత అధికారులతో హజ్ శిబిరం ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా హజ్ యాత్రికుల కోసం ఉత్తమ హజ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హజ్ కమిటీ కోసం 4 కోట్ల రూపాయలు కేటాయించారాన్నారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 7800 మంది యాత్రికులు హాజ్యాత్రకు వెళ్తున్నారని అన్నారు.ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు తమ సహకారం అందిస్తాయని సమీక్ష సమావేశంలో ఉన్నత అధికారులు అన్నారు.జూలై 30 నుంచి హజ్ శిబిరం ఉంటుందన్నారు. ఆగస్టు 1 నుంచి 16 వరకు విమానం ద్వారా యాత్ర కొనసాగుతుందని, ప్రతి విమానంలో 300 మంది చొప్పున హాజ్యాత్రకు వెళ్తారని వివరించారు.

ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ సలహాదారుడు ఏకే ఖాన్ గారు,వక్ఫ్ బోర్డ్ సీఈఓ షానవాజ్ ఖాసీం (IPS),రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ సలీం,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసిఉల్లహ ఖాన్,రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

mahamood ali 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *