
-863 మందికి గాయాలు
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర విషాదంతో ముగిసింది.. బక్రీద్ సందర్భంగా సైతాన్ లపై రాళ్లదాడిలో తొక్కిసలాట జరిగింది. దీంతో లక్షల్లో ఉన్న మంది మధ్య తొక్కిసలాటలో వందల మంది చనిపోయారు. దాదాపు 717 మంది మృత్యువాత పడగా.. 863మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో అరబ్, ఆఫ్రికా దేశాలకు చెందిన వారే ఎక్కువున్నారు. భారతీయులు 4 గురు చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నట్టు సమాచారం.