హక్కుల కోసం ‘సబ్ ఎడిటర్ల’ ఐక్యపోరు..

sakshi3

సంస్థలు వేరైనా.. ఉద్యోగులం తామంతా ఒక్కటే అని నిరూపించారు సబ్ ఎడిటర్లు.. పత్రికలతో పోట్లాడుకుంటున్నా.. తమ హక్కులు పొందడంలో మాత్రం కలిసి అడిగేశారు.. జర్నలిస్టు సంఘంలో సబ్ ఎడిటర్లకు ఎదురవుతున్న నిరాదరణను కలిసికట్టుగా కూటమిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. అందుకే తమకు ఒక సంఘం కావాలని నిర్ణయించి భేటి అయ్యారు..

కరీంనగర్ లో ఉజ్వల పార్క్ లో ఇటీవల నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ప్రభ, తదితర పత్రికల సబ్ ఎడిటర్లు సమావేశమై తమ హక్కుల కోసం ఏం కార్యాచరణ రూపొందించాలనే దానిపై చర్చించారు.. ఈ సమావేశానికి నమస్తే ఎడిషన్ ఇన్ చార్జి మల్లేషం, సాక్షి ఎడిషన్ ఇన్ చార్జులు సురేశ్, బొల్లబత్తిని శ్రీనివాస్ లు, ఆంధ్రజ్యోతితో పాటు అన్ని పత్రికల సబ్ ఎడిటర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్ల సమస్యలపై కలిసి పోరాడుదామని నిర్ణయించారు. విలేకరులకు ఉన్న సౌకర్యాలన్నింటిని సబ్ ఎడిటర్లకు కల్పించాలని వారు తీర్మానించారు. ఇందులో భాగంగానే పత్రిక తరుఫున ఇద్దరితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా సబ్ ఎడిటర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపాదించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *