హంతకులే సంతాపం తెలుపుతారట..

ktr

-టీడీపీపై మండిపడ్డ కేటీఆర్, జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, ప్రతినిధి : పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న టీడీపీపై మండిపడ్డారు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిలు.. టీడీపీ నాయకులు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ హయంలో టీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ కలుపుకున్నప్పుడు.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నాయకులను టీడీపీలో కలిపేసుకున్నప్పుడు స్పందించని టీడీపీ నేతలు.. టీఆర్ఎస్ లో చేరితే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని.. ఆయన  రెండు నాల్కల ధోరణిని ఎందుకు తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే అమరవీరుల కోసం ట్యాంక్ బండ్ లో అమరుల స్తూపం నిర్మిస్తామంటున్న టీడీపీ నేతలు.. అసలు అమరవీరుల మృతికి కారణం మీరు కాదా అని కేటీఆర్ మండిపడ్డారు. ఇది చూస్తుంటే ‘హంతకులే సంతాపం ’ తెలిపినట్టు అవుతుందని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాలు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్నుడు తమరు ఎక్కడ పడుకున్నారని టీడీపీ ని ప్రశ్నించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *