స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాను ప్రారంభించనున్న వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాలో ఐ బ్యాంకు

రూ.కోటి విలువ చేసే అత్యాధునిక ప‌రిక‌రాలు

కొత్త ఎసీ పోస్టు ఆప‌రేటివ్ వార్డు

నేత్రాల సేక‌ర‌ణ‌కు అంబులెన్స్‌

బుధ‌వారం ప్రారంభించ‌నున్న వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు కొత్త హంగులు స‌మ‌కూరుతున్నాయి. రూ.కోటి విలువైన అత్యాధునిక ప‌రిక‌రాల‌తో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఎసీ పోస్టు ఆప‌రేటివ్ వార్డు స‌మ‌కూరింది. నేత్రాల సేక‌ర‌ణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీట‌న్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు. కంటి వైద్యం, శ‌స్త్ర చికిత్స‌ల‌కు సంబంధించి పెట్టింది పేరైన ప్ర‌భుత్వ స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాకు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో రూ. కోటి విలువైన అత్యాధునిక ప‌రిక‌రాలు స‌మ‌కూరాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క‌లెక్ష‌న్ సెంట‌ర్‌ని ఐ బ్యాంకుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే మొద‌టి సారిగా పోస్టు ఆప‌రేటివ్ వార్డుని 20 ప‌డ‌క‌ల‌తో సెంట్ర‌లైజ్డ్ ఎసితో ఏర్పాటు చేస్తున్నారు. ఐ బ్యాంకు కోసం నేత్రాల సేక‌ర‌ణ‌కు ఒక నూత‌న అంబూలెన్స్ ఏర్పాట‌వుతున్న‌ది. వీట‌న్నింటిని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి బుధ‌వారం ప్రారంభించ‌నున్నారు. హైద‌ర‌బాద్ న‌గ‌రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని సరోజ‌నీ కంటి వైద్య‌శాల సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్‌గౌడ్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *