స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల పై ఉన్న‌తాధికారుల‌తో వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి స‌మీక్ష‌

కంటికి రెప్ప‌లా ఏర్పాట్లు

799 టీముల‌తో కంటి ప‌రీక్షా శిబిరాలు

లోటుపాట్లు లేకుండా జాగ్ర‌త్త‌లు

శ్ర‌ద్ధ‌గా, జాగ్ర‌త్త‌గా క్యాంపుల నిర్వ‌హ‌ణ‌

గ‌జ్వేల్‌లో సిఎం చేతుల మీదుగా ప్రారంభం

గ్ల‌కోమా, డ‌యాబెటిక్ రెటినోప‌తిల‌కూ చికిత్స‌లు

స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల‌క‌నుగుణంగా కంటి ద‌వాఖానాల అభివృద్ధి

కంటి శిబిరాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు క‌లెక్ట‌ర్ల‌కు

10 పూర్వ జిల్లాల్లో మంత్రి ప‌ర్య‌ట‌న‌లు

ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు, స‌మీక్ష‌లు

ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి లేఖ‌లు

స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల పై ఉన్న‌తాధికారుల‌తో వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి స‌మీక్ష‌

హైద‌రాబాద్ః కంటి వైద్య‌శిబిరాల విజ‌య‌వంతానికి ఏర్పాట్లు కంటికి రెప్ప‌లా ఉండాల‌ని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాల‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ‌జ్వేల్ లో సిఎం చేతుల మీదుగా ప్రారంభ‌మ‌య్యే ఈ కార్య‌క్ర‌మాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. సిఎం కెసిఆర్ ఆదేశానుసారం స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ మీద మంత్రి ల‌క్ష్మారెడ్డి హైద‌రాబాద్‌లోని ఆరోగ్య‌శ్రీ కార్యాల‌య కాన్ఫ‌రెన్స్ హాలులో వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైద్య శిబిరాల నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే 799 టీములు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. ఆయా టీముల‌కు శిక్ష‌ణ కూడా పూర్తి చేశామ‌న్నారు. ఆయా టీముల‌ను ఎక్క‌డెక్క‌డకు పంపించాలి? ఏయే గ్రామాల్లో శిబిరాలు నిర్వ‌హించాలి? అనే విష‌యాల‌తోపాటు ఆయా టీముల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసి, నిర్ణీత గ‌డువు, స‌మ‌యాల్లో ప‌నులు పూర్త‌య్యేట్లు చూసుకోవాల‌న్నారు.

గ‌జ్వేల్‌లో సిఎం చేతుల మీదుగా ప్రారంభం

స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల శిబిరాల‌ను సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందున అందుకు త‌గ్గ‌ట్లుగా గ‌జ్వేల్‌లో ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. వైద్య శిబిరాల‌తోపాటు సిఎం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే విధంగా ఏర్పాట్లు ఉండాల‌ని చెప్పారు. ఆ కార్య‌క్ర‌మానికి స‌రిపోయే విధంగా సిబ్బందిని సిద్ధం చేయాల‌ని సూచించారు.

గ్ల‌కోమా, డ‌యాబెటిక్ రెటినోప‌తిల‌కూ చికిత్స‌లు

సాధార‌ణ కంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రీక్షించి, చికిత్స‌, మందులు, కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వ‌డ‌మే గాక‌, గ్ల‌కోమా, డ‌యాబెటిక్ రెటినోప‌తి వంటి స‌మ‌స్య‌ల‌కు కూడా చికిత్స‌లు అందేలా చూడాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌కు చెప్పారు. కంటి స‌మ‌స్య‌ల‌తో ఏ ఒక్క‌రూ బాధ‌ప‌డ‌వ‌ద్ద‌న్న ల‌క్ష్యంతో సిఎం కెసిఆర్ చేప‌ట్టిన ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల‌క‌నుగుణంగా కంటి ద‌వాఖానాల అభివృద్ధి

స‌మ‌గ్ర కంటి ప‌రీక్ష‌ల వ‌ల్ల కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వాళ్ళు గుర్తింపులోకి వ‌స్తార‌ని, అలాంటి వాళ్ళ‌కి స‌రిపోయే విధంగా ప్ర‌భుత్వ ద‌వాఖానాల‌ను అభివృద్ధి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ రంగంలో బాగా ప‌ని చేస్తున్న స‌రోజ‌నీ కంటి ద‌వాఖానా, వ‌రంగ‌ల్ లోని ప్రాంతీయ కంటి ద‌వాఖానాతోపాటు, ప్రాథ‌మిక స్థాయిలో ప‌లు కంటి ద‌వాఖానాల‌ను అభివృద్ధి ప‌ర‌చాల‌ని అంద‌కు ప్ర‌ణాళిక‌లు
సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

కంటి శిబిరాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు క‌లెక్ట‌ర్ల‌కు

కంటి శిబిరాల నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించిన‌ట్లు మంత్రి తెలిపారు. జిల్లాల క‌లెక్ట‌ర్లు ఆయా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తార‌న్నారు. అయితే, వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు క‌లెక్ట‌ర్ల సూచ‌న‌లు, స‌హ‌కారం తీసుకోవాల‌ని మంత్రి చెప్పారు.

10 పూర్వ జిల్లాల్లో మంత్రి ప‌ర్య‌ట‌న‌లు

కంటి వైద్య శిబిరాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డానికి వీలుగా, తాను పూర్వ 10 జిల్లాల్లో ప‌ర్య‌టిస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌లిసి వారిని భాగ‌స్వాముల‌ను చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి, స‌మీక్ష‌లు జ‌రుపుతామ‌న్నారు. అలాగే ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వైద్య ఆరోగ్య శిబిరాల‌పై లేఖ‌లు రాస్తామ‌ని మంత్రి అధికారుల‌కు తెలిపారు.

ఈ స‌మీక్ష‌లో వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, ఆరోగ్యశ్రీ సిఇఓ మాణిక్ రాజ్‌, వైద్య విద్య సంచాల‌కుడు డాక్ట‌ర్ ర‌మేశ్‌రెడ్డి, వైద్య సంచాల‌కుడు డాక్ట‌ర్ గ‌డ‌ల శ్రీ‌నివాస‌రావు, వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ శివ ప్ర‌సాద్‌, నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, స‌రోజ‌నీ కంటి ద‌వాఖాన సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్‌గౌడ్‌, డాక్ట‌ర్ లింగం, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండి వేణుగోపాలరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *