Breaking News

స్వైన్ ఫ్లూ బారిన అరకు ఎంపీ

kothapalli-geetha

విశాఖ, ప్రతినిధి :  స్వైన్ ఫ్లూ మహమ్మారి విస్తరిస్తోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. తీవ్ర చాతినొప్పితో బాధపడుతూ ఆమె ఆదివారం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా .. అనుమానించిన వైద్యులు రక్త పరీక్షలు చేసి నమూనాలను హైదరాబాద్ కు పంపించారు. పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం విశాఖ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరో వైపు చర్లపల్లి జైలులోని ఇద్దరు ఖైదీలకు ఈ వ్యాధి సోకింది. వీరిని జైలు అధికారులు హుటాహుటీన నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించగా.. మరొకరికి ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *