
-ప్రత్యేక బృందాన్ని పంపాలని ప్రధాని మోడీని ఫోన్ లో కోరిన సీఎం కేసీఆర్
-వెంకయ్య, దత్తాత్రేయలను సహకరించాలని విజ్ఞప్తి
-స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అందించాలని కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, ప్రతినిధి : స్వైన్ ఫ్లూ పై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. హైదరాబాద్ లో అంతకంతకు పెరుగుతూ మృతుల సంఖ్య పెరగడంతో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయపై ప్రత్యేక బృందాన్ని పంపాందిల్సిందిగా బుధవారం ఉదయం ప్రధాని మోడీని అభ్యర్థించారు. దీనికి ప్రధాని సరే అని బృందాన్ని పంపనున్నారు.
ఇక స్వైన్లు విషయంలో తమ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడారు. వ్యాధి తగ్గించడంలో సహాయపడాలని కోరారు.
స్వైన్ ఫ్లూ విజృంభిస్తుండడంతో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో స్వైన్ ఫ్లూపై చర్చించనున్నారు. ఎంత ఖర్చయినా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ను ప్రజలందరికీ పంపిణీ చేయాలని కోరారు.