స్వైన్ ఫ్లూ ఎలా వస్తుంది.? నివారణ ఉందా?

హైదరాబాద్, ప్రతినిధి : స్వైన్ ఫ్లూ వ్యాధి ముందు మనుషులకు వచ్చింది కాదు… ఇది పందులకు సోకే వైరస్ వ్యాధి.. పందులకు సోకే జలుబు, జ్వరాన్ని స్వైన్ ఫ్లూ అంటారు. పందిమాంసాన్ని మనుషులు తినడం వల్ల , లేదా పందులకు సమీపంగా ఉండడం వల్ల గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనుషులకు సోకింది.  విదేశాలనుంచి మన భారత్ కు సంక్రమించిన ఈ వ్యాధిపై ఇంతవరకు మందు లేదు. వ్యాక్సిన్ ను మాత్రం శాస్త్రవేత్తలు కనిపెట్టారు. స్వైన్ ఫ్లూకు కారణమైన వైరస్ హెచ్1ఎన్1.

స్వైన్ ఫ్లూ లక్షణాలు..
తీవ్ర జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలు. బాధితులు చాలా వేగంగా శ్వాసతీసుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఒక్కోసారి ఛాతి, పొత్తి కడుపు నొప్పితోనూ బాధపడుతారు. చర్మం కూడా నీలి రంగులోకి మారిపోతుంది. పాలు, నీళ్లు, పళ్ల రసాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవేళ నీళ్లు తాగినా తీవ్రంగా వాంతులు అవుతాయి. ఒక్కసారిగా మగతలోకి వెళ్లిపోతారు. మెలకువగా ఉన్నా పరాకుగా ఉంటారు.

నివారణ ఇలా..
-వైరస్ వ్యాపించకుండా శుభ్రత పాటించాలి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి..
-ప్రస్తుత పరిస్థితుల్లో జనసందోహంలో తిరగడం తగ్గించాలి
-జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
-ముక్కు, నోరుకు రుమాలు కట్టుకుంటే గాలి ద్వారా సోకే వైరస్ ను నిరోధించే వచ్చు.
-శరీరం సాధారణ కంటే అధికమైతే(100 డిగ్రీల ఫారన్ హీట్ దాటితే) విపరీతమైన దగ్గు, గొంతు మంట, ముక్కు కాడం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
-నిల్వ ఆహారం కాకుండా వేడిగా ఉన్నప్పుడే తినాలి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.