
వరంగల్ : స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరితే సహించేది లేదని, తెలంగాణ జాతిని అవమానిస్తే పాతరేస్తమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి దాదాపు కనుమరుగైన ఆ రెండు ఛానళ్లకు ఇంకా బుద్ది రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. తనతో పాటు ఈ రాష్ట్ర శాసనసభ స్పీకరు హాజరైన సభకు సదరు ఛానళ్ల ప్రతినిధులు ముఖానికి నల్ల గుడ్డలు కట్టుకుని వచ్చి మరో తప్పు చేస్తున్నారన్నారు.
ఈ రాష్ట్రం సిద్దించి మొదటి సారిగా కొలువైన శాసభనుద్దేశించి అత్యంత నీచంగా వార్తా కథనాలను ప్రసారం చేసి తప్పు చేసినందుకే తెలంగాణ సమాజం ఆ ఛానళ్లను కిలోమీటరు లోతున పాతరేశారని, అయినా వారి డ్రామాలు ఆగట్లేదన్నారు. మొన్న ఢిల్లీలో, ఇవాళ ఇక్కడ పిచ్చిపిచ్చి వేశాలేస్తున్నారన్నారు. స్వేచ్ఛ పేరుతో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, తెలంగాణ జాతిని అవమానించేలా వార్తలు ప్రసారం చేస్తే పది కిలోమిటర్ల మేర పాతరేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ శాసనసభ్యులను పట్టుకుని పాచి కల్లు తాగిన ముఖాలంటారా?… టూరింగు టాకీసుల సినిమా చూసెటోల్లను పట్టుకొచ్చి మల్టిప్లెక్సుల సినిమా చూపిస్తే గిట్టనే ఉంటదని ఎగతాలి చేస్తరా?….ఇది సంస్కారామా?… ఇది మీడియా స్వేచ్ఛనా.. మెడలు విరిచేస్తం ఏమనుకున్నరో… అంటూ ఒకింత తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కేసీఆర్ను తిడితే అభ్యంతరం లేదు.. స్వేచ్ఛ ముసుగులో ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని, తాట తీస్తమన్నారు