Breaking News

స్వామీజీ బండారం బట్టబయలు

హైదరాబాద్, ప్రతినిధి : పోయిన నెలలో స్వామిజీ చెప్పాడని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ నగరాల్లోని మహిళలు మార్కెట్లోకి వెళ్లి ‘తామరవత్తుల’ కోసం దేవులాడారు.. గుర్తుందా..? ఆ వత్తుల ఇంటిముందు వెలిగిస్తే తమ భర్త, పిల్లలు బాగుంటారని.. ఐశ్వర్యం సిద్ధిస్తుందని ఓ స్వామిజీ టీవీలో చెప్పాడు. దాన్ని నమ్మి జనం విరగబడి తామరవత్తులకోసం ఎగబడ్డారు.

ఆ తామర వత్తుల స్వామీజీ బాగోతం బయటపడింది. ఆయన కర్ణాటక, కేరళలో ఇలానే జనాన్ని మోసగించి సొమ్ము చేసుకున్నాడు. ఆయన అమ్మాయిలతో సరస సల్లాపాలతో తూలుతున్నప్పుడు జనం పట్టుకుని చితకబాదారు. ఇక అక్కడ ఆ బండారం బయటపడడంతో ఏపీకి మకాం మార్చాడు. సురేంద్రపురిలో ఓ ఆశ్రమం ఏర్పాటుచేసుకొని టీవీల్లో కనపడుతూ జనాన్ని మళ్లీ మోసం చేస్తున్నారు. ప్రముఖ చానల్ జీ తెలుగులో ఈ స్వామీజీ ప్రొగ్రాం ప్రతీరోజు ప్రసారం అవుతుంది. దాన్ని నమ్మి జనం పూజలు పునస్కారాలంటూ మోసపోతున్నారు. ఆయన అసలు బాగోతం పైనున్న వీడియో చూస్తే తెలిసిపోతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *