Breaking News

స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు, మాజీ మంత్రి భాట్టం శ్రీ‌రామ‌మ్మూర్తి క‌న్నుమూత‌

bhattam-srirammurthy-(1)

bhattam srirammurthy 2విజ‌య‌న‌గ‌రం/ విశాఖప‌ట్నం జాన్ 6 :- ప్ర‌ముఖ స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు, మాజీ మంత్రి , పాత్రికేయుడు భాట్టం శ్రీ‌రామ‌మ్మూర్తి (89) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు. 1926 మే 12న విజ‌య‌న‌గ‌రం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో జ‌న్మించిన ఆయ‌న స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప‌లుమార్లు జైలు శిక్ష అనుభ‌వించారు. త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించి విజ‌య‌న‌గ‌రం యూత్ కాంగ్రెస్‌. పట్ట‌ణ కాంగ్రెస్ విభాగాల‌లో ప‌నిచేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీకి స‌భ్యునిగా 16 సంవ‌త్స‌రాలు సేవ‌లందించారు. విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ స్ధానానికి 1962లో తొలిసారిగా ఎన్నికైన ఆయ‌న ఆ త‌ర్వాత 1972,1978లో విశాఖ జిల్లా ప‌ర‌వాడ అసెంబ్లీ స్ధానానికి ఎన్నికై రాష్ట్ర మంత్రి వర్గంలో విద్య‌, సాంఘిక సంక్షేమం, సాంస్కృతిక శాఖల మంత్రిగా ప‌నిచేశారు. 1984లో విశాఖ స్ధానం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్ధిగా పార్ల‌మెంటుకు వెళ్లారు. ఆ త‌రువాత రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. హంగేరిలో జ‌రిగిన ప్ర‌పంచ శాంతి సద‌స్సులో భార‌త ప్ర‌తినిధిగా పాల్గొని మ‌న దేశ ఔన్న‌త్యాన్ని చాటి చెప్పారు. జ‌య‌భార‌త్ ప‌త్రిక‌కు ఉప‌సంపాద‌కునిగా, ప్ర‌జార‌ధం వార‌ప‌త్రిక‌కు ఎడిట‌ర్‌గా 1969లో హైద‌రాబాద్ నుంచి వెలువ‌డే ఆంధ్ర‌జ‌నత ప‌త్రిక‌కు సంపాద‌కునిగా ప‌నిచేశారు. భార్య‌, ఓ కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు క‌లిగిన ఆయ‌న చివ‌రిద‌శ‌లో భ‌క్తిభావాల‌కు అంకిత‌మ‌య్యారు. నిష్క‌ళంక రాజ‌కీయ నాయ‌కునిగా పేరుగాంచిన భాట్టం మృతి ప‌ట్ల ఉత్త‌రాంద్ర ప్ర‌జానీకం నివ్వెర‌పోయింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఓ ప్ర‌క‌ట‌న‌లో సంతాపం తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *