Breaking News

స్వయం ఉపాధితోనే నిరుద్యోగ సమస్య తీరుతుంది: మంత్రి కడియం శ్రీహరి

స్వయం ఉపాధితోనే నిరుద్యోగ సమస్య తీరుతుంది: మంత్రి కడియం శ్రీహరి

స్వయం ఉపాధితో నిరుద్యోగ సమస్య తీరుతోంది

మహిళలు ఆర్ధికంగా ఎదగాలి..మహిళా భవన్ కు రూ.15 లక్షలు మంజూరు

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కార్యక్రమంలో ఔత్సాహికులకు మిషన్లు, సర్టిఫికేట్లు పంపిణీ చేసిన ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్ : నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం ద్వారా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. ఉప్పల్ నియోజక వర్గంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ, ఔత్సాహిక అభ్యర్థులకు కుట్టుమిషన్లు, సర్టిఫికేట్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ మల్లారెడ్డి అందించారు. సిడీఎస్ సంస్థ హౌజింగ్ బోర్డు పరిధిలో 1000 మందికి టైలరింగ్, బ్యూటీషియన్, చేతివృత్తులు, మొగ్గం పనుల్లో శిక్షణ ఇచ్చి దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సంస్థ సమన్వయ కర్త సత్యనారాయణ తెలిపారు. మహిళలు ఆర్ధికంగా బలపడాలని, ఇందులో భాగంగా మహిళా భవన్ నిర్మాణానికి 15 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ జి.అంజయ్య అధ్యక్షత వహించగా, సమీప పది మంది కార్పోరేటర్లు, స్థానికులు పాల్గొన్నారు.

kadiyam srihari new 1    kadiyam srihari new 2     kadiyam srihari new 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *