Breaking News

’స్వచ్ఛ హైదరాబాద్’ను ప్రారంభించిన గవర్నర్, కేసీఆర్,

KCR-starts-Swachh-Bharat

హైదరాబాద్ : హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా రూపొందించేందుకు దాదాపు 200 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ ఐసీసీ లో ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వళన చేసిన ఇద్దరు హైదరాబాద్ పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ ను 425 భాగాలు చేసి ప్రతి ఒక్క విభాగానికి మంత్రులు, ఐఏఎస్ నుంచి కింది స్థాయి అధికారి వరకు బాధ్యతలు అప్పగించారు. భారీగా నిధులు కేటాయించి ఆయా వాడల్లో వారం పాటు పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ కూడా ఒక్కో డివిజన్ లో స్వచ్ఛభారత్ నిర్వహిస్తారు. కార్యక్రమ లోగోను, స్లోగన్ ను కేసీఆర్, గవర్నర్ శనివారం అవిష్కరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *