స్వచ్ఛ్ సర్వేక్షన్” పోస్టర్ ను విడుదల చేసిన హోం మంత్రి

స్వచ్ఛ్ సర్వేక్షన్” పోస్టర్ ను విడుదల చేసిన హోం మంత్రి

“ స్వచ్ఛ్ సర్వేక్షన్” పోస్టర్ ను రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖా మంత్రి శ్రీ నాయిని నర్సింహ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో విడుదల చేశారు. హెదరాబాద్ లో ఈ నెల 12 వ తేదిన భారీ స్థాయిలో నిర్వహించనున్న స్వచ్ఛ్ సర్వేక్షన్ కార్యక్రమంలో దాదాపు 15 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో హోం మరియు కార్మిక శాఖా మంత్రి శ్రీ. నాయిని నర్సింహ రెడ్డి, మున్సిఫల్ శాఖా మంత్రి శ్రీ. కె. తారక రామరావు, పోచంపల్లి హ్యండ్లూమ్ ఇండియా అంబాసిడర్ రేష్మి టాగూర్ తదితరులు పాల్గొననున్నారు. భారతదేశంలోనే అత్యదిక జనాబా కలిగిన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో పరిశుభ్రంగా ఉండాలనే నినాదంతో ఈ కార్యక్రమం జరుపనున్నారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి పరిధిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ కళాశాల సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి అత్యదిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయమన్నారు. రేష్మి టాగూర్ మాట్లాడుతూ పరిశుభ్రతకు ప్రాదాన్యతనివ్వాలన్నారు. జి.హెచ్.ఎం.సి. స్టాండింగ్ కమిటి సభ్యులు, రాంనగర్ కార్పోరేటర్ శ్రీ. వి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్యర్యంలో కార్యక్రమం జరగనుంది.

“ తైక్వాండో” కు వెళ్తున్న సిందును అభినందించిన హోం మంత్రి

డల్లాస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్ షిప్స్- 2018 కి వెళ్తన్న కాలేను సిందు తపస్వీని రాష్ట్ర హోం,  కార్మిక శాఖా మంత్రి శ్రీ. నాయిని నార్సింహ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో అభినందించారు. ఫిబ్రవరి 10వ తేది నుండి ఈ పోటీలు డల్లాస్ లో జరుగనున్నాయి.

nayini narasimha reddy     HM,Reshma tagore have released Swachh survekshan poster @Secretariat today.2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *