
గుంటూరు : స్లాబ్ వేస్తున్న సమయంలో సెంట్రింగ్ అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలుగలేదు. గుంటూరు జిల్లాలోని రింగ్ రోడ్డులో ఓ షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణం చేపడుతున్నారు. భవనానికి స్లాబ్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం అకస్మాత్తుగా భవనంలోని ముందు భాగం సెంట్రింగ్ కుప్ప కూలింది. దీనితో అక్కడున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక కార్మికుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇతరులెవరికీ ప్రాణాపాయం కలుగలేదు.
సెంటింగ్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. భవనాన్ని ఇంజినీర్లు పరీక్షించలేదని సమాచారం. ఘటన జరిగినప్పుడు సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాప్రదేశానికి చేరుకున్నారు. భవన నాణ్యతను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.