
ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు అయిన స్మార్ట్ సిటీస్ లో తెలుగు రాష్ట్రాలు అన్యాయమైపోయాయి. స్వయాన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాడు. మోడీ ప్రభుత్వ తమకు సీట్లు వచ్చే.. మద్దతు ఇచ్చే రాష్ట్రాలకే ఎక్కువ స్మార్ట్ సిటీస్ అవకాశం ఇచ్చింది. మోడీ పక్షపాత ధోరణికి ఇది నిలువుటద్దంలా కనిపిస్తోంది..
తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాలని నిజామాబాద్ , కరీంనగర్ , వరంగల్ , ఖమ్మం, రామగుండం, హైదరాబాద్ లను చేర్చి ప్రణాళికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కానీ ముష్టిగా కేవలం హైదరాబాద్, వరంగల్ లను మాత్రమే చేర్చి మిగతా నగరాలను గాలికొదిలేసింది..
ఇక ఏపీ ప్రభుత్వం చిత్తూరు, నెల్లూరు, విజయవాడ , కాకినాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతిలను చేర్చినా కేవలం మూడింటికే అవకాశం ఇచ్చింది. విశాఖ, కాకినాడ, తిరుపతిలను ఇచ్చి మోసం చేసింది..
మొత్తానికి మన తెలుగు వెంకయ్యనాయుడే మనకు ఘోరంగా అన్యాయం చేశారు. తమకు రాజ్యసభలో మద్దతిస్తున్న తమళనాడుపై మాత్రం ప్రేమ ఒలకబోసారు. అక్కడ 12 నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపికచేశారు. ఉత్తరాన ఉత్తరప్రదేశ్ లో గరిష్టంగా 13 నగరాలను చేర్చింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఓటు బ్యాంకు నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి భారీగా మంజూరు చేశారు. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కు కూడా 10 వరకు స్మార్ట్ సిటీలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారు.
మనం కలిసికట్టు.. ఓటు బ్యాంకు లేకపోవడం ఈ దుస్థితికి కారణం. అదే తమిళనాడులో ఏక పార్టీ, వారి మెజారిటీయే వారికి భారీగా నిధులు, పథకాలను మంజూరు చేయిస్తోంది..