స్పీకర్ మధుసూదనాచారికి వడదెబ్బ

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి వడదెబ్బ తగిలింది..రెండురోజులుగా మధుసూదనాచారి తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు..సమీక్షల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం చెరువుల పూడికతీత పనులు ప్రారంభానికి వరంగల్ జిల్లా రేగొండ మండలం సుల్తాన్ పూర్ లో పర్యటించగా అక్కడే కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఆయనను పరకాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి స్పీకర్ హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు.

కాగా పోయినేడాది సైతం ఎండల్లో తిరిగి స్పీకర్ వడదెబ్బకు గురయ్యారు. ఇప్పుడు కూడా ఆయన వడదెబ్బతో బాధపడడం విచారకరం.. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *