Breaking News

స్పీకర్ ఇంటి ఎదుట ఎర్రబెల్లి బృందం ధర్నా

errabelli

హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఆమోదించాలంటూ వెళ్లిన టీటీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా చేశారు. ఈరోజు ఉదయం ఎర్రబెల్లి మిగతా టీటీడీపీ నేతలు స్పీకర్ మధుసూదనాచారిని కలవడానికి వెళ్లారు. అక్కడున్న పోలీసులు వారిని లోనికి వెళ్లనివ్వలేదు.. దీంతో ఆగ్రహించిన ఎర్రబెల్లి టీడీపీ నేతలు స్పీకర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది..

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తలసాని రాజీనామా చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్పీకర్ తలసాని రాజీనామా ఆమోదించాలని కోరారు. తలసాని కూడా రాజీనామా ఆమోదించుకొని గెలవాలని.. తలసాని ఎన్నికల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *