Breaking News

స్పిన్ పిచ్ పై తొలిరోజే 12 వికెట్లు

cri

టీమిండియా-సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ 4 రోజులు కూడా నడిచే పరిస్థితులు కనపడడం లేదు.. పంజాబ్ లోని మోహాలీ పిచ్ కంప్లీట్ గా స్పిన్ కు సహకరిస్తోంది. దీంతో ఈ పిచ్ పై తొలిరోజే టీమిండియా ఆలౌట్ అయ్యింది..

తొలిరోజేే 201కే ఇండియా కుప్పకూలింది. విజయ్ 75, జడేజా 38 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ ఎల్గర్ 22 పరుగులకే 4 వికెట్లు తీసి ఇండియాను నేలకూల్చాడు.

దీంతో మొదటి రోజు ఇండియా 201కే ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన సౌతాఫ్రికాకు భారత స్పిన్నర్లు షాక్ ఇచ్చారు. 20 ఓవర్లలో 2 వికెట్లు తీసి వాహ్వా అనిపించారు. జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. తొలిరోజు సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 28 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఆడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *