స్థానికులకే ఉద్యోగాలివ్వండి..

జహీరాబాద్ : మహేంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్ల  ప్లాంట్  ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక విధానం  టీఎస్ ఐపాస్ అమలు చేస్తామని.. 15 రోజుల్లో అనుమతులిస్తామని తెలిపారు. కాగా మహేంద్ర కంపెనీ నిర్వాహకులకు ఓ సూచన చేశారు. ప్రాజెక్టులకు నీళ్లు, కరెంటు, మౌళిక సదుపాయాలు కల్పించామని.. మీరు చేయాల్సిందల్లా.. స్థానికులకే ఉద్యోగాలివ్వాలని సూచించారు. అప్పుడే అరిగోసపడి, రక్తం చిందించి తెచ్చుకున్న తెలంగాణ యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, డిప్యూటీస్పీకర్ పద్మా, ఎమ్మెల్యే గీతారెడ్డి. ఎంపీ బీబీ పాటిల్,  తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *