
కాకినాడ ఎంపీ తోట నర్సింహులు అనుచరుల ఆగడాలు శృతి మించాయి. తూర్పు గోదావరి జిల్లా మాధవపట్నం గ్రామానికి చెందిన రవికుమార్ ఒక న్యాయవాది. ఆయనకు జిల్లాలోని పలు గ్రామాల్లో 18 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కన్నేసిన ఎంపీ అనుచరులు ఎలాగైనా తక్కువ ధరకు ఇవ్వాలని న్యాయవాదిని కోరారు. ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయన కూతురిపై కన్నేశారు..
న్యాయవాది 16 ఏళ్ల కూతురు జ్వరంతో ఓసారి ఆస్పత్రికి వెళితే స్కానింగ్ తీస్తుండగా.. డాక్టర్ సాయంతో ఆమె నగ్న వీడియోలు తీశారు. అవి న్యాయవాదికి చూపించి బెదరిించారు. స్థలం ఇవ్వకపోతే ఈ వీడియోలు ఇంటర్నెట్ లో పెడతామని హెచ్చరించారు. దీంతో న్యాయవాది జాతీయ బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆగ్రహించిన కమిషన్ ఎంపీ, ఆయన అనచరులపై కేసు నమోదు చేయాలని ఏపీ డీజీపీని ఆదేశించింది..