స్టార్ హీరో కోసం దానయ్య చూపు..

వరుసగా పరాజయాలు చూస్తున్న నిర్మాతల్లో డివివి దానయ్య ఒకరు. కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందని.. అందులో ఓ స్టార్ హీరో నటిస్తాడని ఫజిల్ విసిరారు. దీంతో ఆ సినిమాలో హీరో ఎవరా అని ఎవరికి వారు ఫలానా అంటూ ఊహించుకున్నారు. వీరిలో చాలామంది ఎన్టీఆర్ తోనే అనుకున్నారు. మరికొందరు రామ్ చరణ్ అన్నారు. కానీ ఈ ఇద్దరూ కాదు మళ్లీ రవితేజతోనే దానయ్య సినిమా అనేది లేటెస్ట్ న్యూస్.
రవితేజ వైపే మొగ్గిన దానయ్య..
ఇక గతంలో కూడా దానయ్య, రవితేజ కాంబినేషన్ లో దుబాయ్ శీను, నేనింతే లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో దుబాయ్ శీను దుమ్మురేపితే, నేనింతే కమర్షియల్ గా అనుకన్నంత సక్సెస్ కాలేదు. అయినా మూడోసారి రవితేజతోనే దానయ్య సినిమా చేయబోతున్నాడంటోంది టాలీవుడ్. అంతేకాక మిర్చి సినిమా చూసిన తర్వాత కొరటాల స్టైల్ ఆఫ్ మేకింగ్ కు రవితేజ బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సూట్ అవుతుందని చాలామంది చెప్పారట. అందుకే ఫైనల్ గా రవితేజ వైపే మొగ్గుచూపారని సమాచారం. అయితే దీని వెనక మరో కోణం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అటు చరణ్ కూడా గోవిందుడు అందరివాడే తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడు. అందుకే ఇప్పట్లో సాధ్యం కాదనే రవితేజతో సినిమా ఫైనల్ చేశారట. అంటే పవర్ తర్వాత రవితేజ కొత్త సినిమా ఇంకా కమిట్ కాలేదు. అది ఇదే కావచ్చనేది లేటెస్ట్ న్యూస్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.