స్టాండింగ్ క‌మిటీలో 24 అంశాల‌కు తీర్మానం

జీహెచ్ఎంసీ నూత‌న స‌భ్యుల‌తో స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం నేడు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశానికి నూత‌నంగా ఎన్నికైన గొల్లూరు అంజ‌య్య‌, తుము శ్ర‌వ‌న్‌కుమార్‌, ముద్ద‌గౌని ల‌క్ష్మిప్ర‌స‌న్న‌, సింగిరెడ్డి స్వ‌ర్ణ‌ల‌త‌, అబ్దుల్ వాహెబ్‌, న‌స్రీన్ సుల్తానా, మ‌హ్మ‌ద్ మాజీద్ హుస్సేన్‌, మ‌హ్మ‌ద్ మొబిన్‌, మ‌హ్మ‌ద్ మూర్తుజా అలీ, మ‌హ్మ‌ద్ ర‌షీద్ ఫ‌రాజుద్దీన్‌, వి.శ్రీ‌నివాస్‌రెడ్డిలు హాజ‌రుకాగా ఎ.కృష్ణ‌, ఎన్‌.శేషుకుమారి, ఎన్‌.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఎ.స‌ర‌స్వ‌తిలు గైర్హాజ‌ర‌య్యారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు భార‌తిహోలీకేరి, అద్వైత్‌కుమార్ సింగ్‌, శృతిఓజా, ముషార‌ఫ్ అలీ, దాస‌రి హ‌రిచంద‌న‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, విభాగాధిప‌తులు హాజ‌రైన స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో 24అంశాల‌ను ఆమోదించారు.
* ఎన్నిక‌ల విభాగం జాయింట్ క‌మిష‌న‌ర్‌కు ఎన్నిక‌ల సంబంధిత చెల్లింపులు చేసేందుకు ఆమోదం.
* లంగర్‌హౌజ్ బాపూఘాట్ నుండి అత్తాపూర్ మీదుగా వెళ్లే రోడ్డు మార్గంలో న‌లంద‌న‌గ‌ర్ సంక్షేమ సంఘం నుండి సిరిమ‌ల్లె గార్డెన్ లేఅవుట్ వ‌ర‌కు 60ఫీట్లకు బ‌దులుగా వంద ఫీట్ల రోడ్డు విస్త‌ర‌ణ‌కు ఆమోదం.
* జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో క‌మాన్ కంట్రోల్ కేంద్రంలో ఎల్‌.ఇ.డి వీడియో వాల్‌ను టి.ఎస్ ద్వారా ఏర్పాటుకు రూ. 2,98,45,513లు చెల్లించ‌డానికి ప‌రిపాల‌న సంబంధిత అనుమ‌తుల‌కు ఆమోదం.
* సుప్రింకోర్టులో అడ్వ‌కేట్ ఆన్ రికార్డ్స్‌కు స్పెష‌ల్ లీవ్ పిటీష‌న్ల‌ను ఫైల్ చేయ‌డానికి  కోర్టు ఫీజు కింద రూ. ల‌క్ష 25వేలు చెల్లించ‌డానికి ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌నలు పంప‌డానికి ఆమోదం.
* ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ కార్యాల‌యంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్ష‌న్ రైట‌ర్లుగా ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిన ప‌నిచేస్తున్న ఐదుగురి స‌ర్వీస్‌ల‌ను 2019 మార్చి 31వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ తీర్మాణాల‌కు ఆమోదం.
* రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ శాస్త్రీపురం వాట‌ర్ రిజ‌ర్వేర్‌కు రూ. 5.25కోట్ల వ్య‌యంతో రీటైనింగ్ వాల్‌, సీసీ రోడ్డు నిర్మాణం చేప‌ట్టేందుకు ప‌రిపాల‌న సంబంధిత ఆమోదం.
* పురానాపూల్ గాంధీ విగ్ర‌హం నుండి బోయిగూడ క‌మాన్ వ‌ర‌కు 60ఫీట్ల రోడ్డు విస్త‌ర‌ణ సంద‌ర్భంగా కోల్పోయే 271 ఆస్తుల సేక‌ర‌ణ‌కు ఆమోదం.
* ఇందిరా పార్కు నుండి నాగ‌మ‌య్య కుంట‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా వీ.ఎస్‌.టి వ‌ర‌కు నిర్మించ‌నున్న నాలుగు లేన్ల మ‌ల్టీలేవ‌ల్ ఫ్లైఓవ‌ర్ కారిడార్ నిర్మాణానికి రెండు మార్గాల్లో 26 ఆస్తుల సేక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు ఆమోదం.
* టౌన్‌ప్లానింగ్ విభాగంలో రిటైర్డ్ ఏసిపి ఎం.ఎ సత్తార్ స‌ర్వీస్‌ల‌ను మ‌రో సంవ‌త్స‌రం పాటు ఉప‌యోగించుకోవ‌డానికి ఆమోదం.
* ప్ర‌తీ జోన్‌లో ఒక స‌ర్కిల్‌ను బిన్ ఫ్రీ స‌ర్కిల్‌గా చేసేందుకు మ‌రో 500 స్వ‌చ్ఛ ఆటోటిప్ప‌ర్ల‌ను కొనుగోలు చేయ‌డానికి అనుమ‌తించేందుకు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపే తీర్మాణానికి ఆమోదం.
* జీహెచ్ఎంసీ గృహ‌నిర్మాణం విభాగంలో రిటైర్డ్ అయిన డిప్యూటి ఇఇ స‌య్య‌ద్ ఆరీఫ్ అహ్మ‌ద్ స‌ర్వీస్‌ల‌ను మ‌రో సంవ‌త్సరం పాటు కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిన కొన‌సాగించేందుకు ఆమోదం.
* ఆరాంఘ‌ర్ కాల‌నీ ప్లే గ్రౌండ్‌లో గ‌ణేష్ విగ్ర‌హాల త‌యారీకి ధ‌రంరాజ్‌సింగ్‌కు తాత్కాలిక అనుమ‌తులు ఇస్తూ తీర్మాణం.
* హాఫీజ్‌పేట్ మంజీర పైప్‌లైన్ నుండి కె.పి.హెచ్‌.బి ఫ్లైఓవ‌ర్ వ‌ర‌కు 120 ఫీట్ల రోడ్డు విస్త‌ర‌ణ సంద‌ర్భంగా కోల్పోయే 98 ఆస్తుల సేక‌ర‌ణ‌కు ఆమోదం.
* శాస్త్రీ పురంలో స్పోర్ట్స్ సెంట‌ర్ స‌మ‌గ్రాభివృద్దిని రూ. 6కోట్ల‌తో చేప‌ట్టేందుకు ప‌రిపాల‌న సంబంధిత అనుమ‌తులు.
* హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్‌లోని సాహెబ్‌న‌గ‌ర్‌లోని హిందూ, ముస్లీం, క్రిస్టియ‌న్ శ్మశాన వాటిక‌ల్లో రూ. 4.58 కోట్ల వ్య‌యంతో అభివృద్ది ప‌నులు చేప‌ట్టేందుకు తీర్మాణం.
* చార్మినార్ స‌ర్కిల్‌లోని కిల్వ‌త్‌లో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌తో పాటు క్రీడా సౌక‌ర్యాల‌ను రూ. 5.99కోట్లతో చేప‌ట్టేందుకు ప్ర‌తిపాద‌న‌ల ఆమోదం.
* న‌గ‌రంలో సేఫ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద సీసీ కెమెరాల ఏర్పాటుకు జ‌రిపిన రోడ్డు త‌వ్వ‌కాల పున‌రుద్ద‌ర‌ణ‌కు చెల్లించాల్సిన రూ. 10,92,680ల‌ను మాఫీ చేయాల్సిందిగా తెలంగాణ డిజిపి కోరినమేర‌కు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లను పంపే తీర్మాణానికి ఆమోదం.
* న‌గ‌రంలోని ప్ర‌ధాన కూడ‌ళ్లు, జంక్ష‌న్లు, ట్రాఫిక్ ఐల్యాండ్‌లు, సెంట్ర‌ల్ మీడియంల సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు ఆర్ట్ ఎట్ తెలంగాణ, క‌ళాకృతి సంస్థ‌తో ప‌నిచేయ‌డానికి తీర్మాణాల‌కు ఆమోదం.
* న‌గ‌రంలో గ‌తంలో మంజూరు చేసిన 50 ఫుట్ఓవ‌ర్ బ్రిడ్జిల‌తో పాటు కొత్త‌గా 12 ఎఫ్‌.ఓ.బిల నిర్మాణానికి రూ. 2,72,72,000ల‌కు ప‌రిపాల‌న సంబంధిత అనుమ‌తుల‌కై ఆమోదం.
* ఖైర‌తాబాద్ జోన్‌లో గ‌తంలో మంజూరుచేసిన 30 లూకేఫేల సంఖ్య‌ను 35కు పెంచుతూ తీర్మాణానికి ఆమోదం.
bonthu ramohan rao new 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.